PM Modi: ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం.. తొలి భారతీయ నేతగా ఘనత

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూ ది అపోస్టల్‌’ను అందుకున్నారు.

Updated : 09 Jul 2024 20:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మంగళవారం రష్యా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూ ది అపోస్టల్‌ (Order of St Andrew the Apostle)’ను అందుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దీన్ని ప్రదానం చేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా 2019లోనే మోదీకి ఈ అవార్డును ప్రకటించారు. దీన్ని స్వీకరించడం గౌరవంగా ఉందని, భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నేత ఆయనే కావడం విశేషం.

‘చిన్నారుల మరణాలతో గుండె తరుక్కుపోతోంది’ - పుతిన్‌తో మోదీ

అంతకుముందు పుతిన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. బాంబులు, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు విజయవంతం కావని ఉద్ఘాటించారు. వాణిజ్యం, భద్రత, వ్యవసాయం, సాంకేతికత తదితర రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై అవగాహన కుదుర్చుకున్నారు. రెండు రోజుల అధికార పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ సోమవారం మాస్కోకు చేరుకున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలు ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. అనంతరం ఆస్ట్రియాకు వెళ్లనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని