PM Modi: అజ్ఞాత సైనికులకు నివాళులర్పించిన మోదీ..

రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సోవియట్‌ సైనికులు, అజ్ఞాత సైనికులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. 

Published : 09 Jul 2024 20:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం మాస్కో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) మంగళవారం మాస్కోలోని ఒక యుద్ధ స్మారక చిహ్నం వద్ద రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులు అర్పించారు. అనంతరం అజ్ఞాత సైనికుల సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ స్మారక చిహ్నం వద్ద ఉన్న కాంస్య శాసనంపై ‘‘మీ పేరు తెలియదు..మీ గుర్తులే ఉన్నాయి’’ అని రాసి ఉంది.

రెండో ప్రపంచ యుద్ధం అనంతరం మిలియన్ల మంది రష్యన్ సైనికులు ఆచూకీ తెలియలేదు. దీంతో వారిని అజ్ఞాత సైనికులుగా ప్రకటించారు. వారి జ్ఞాపకార్థం ఒక సమాధిని నిర్మించారు. 2014 సంవత్సరం నుంచి అక్కడి ప్రజలు డిసెంబర్ 3ను అజ్ఞాత సైనికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని