PM Modi: ముగిసిన రష్యా పర్యటన.. ఆస్ట్రియాకు ప్రధాని మోదీ

రష్యా పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం ఆస్ట్రియాకు పయనమ్యారు. భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే మొదటిసారి.

Published : 09 Jul 2024 21:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రష్యా (Russia) పర్యటన ముగిసింది. మంగళవారం సాయంత్రం ఆయన మాస్కో నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు పయనమయ్యారు. భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే మొదటిసారి. ‘‘ఆస్ట్రియాతో భారత్‌కు దృఢమైన, విశ్వసనీయమైన బంధం ఉంది. ఆ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్‌ వాన్‌డర్‌ బెల్లెన్, ఛాన్సలర్‌ కార్ల్‌ నెహమ్మర్‌తో భేటీ అవుతున్నా. వారితో ప్రజాస్వామ్యం, బహుళత్వ వాదంపై చర్చలు జరపబోతున్నా’’ అని అంతకుముందు ప్రధాని మోదీ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం.. తొలి భారతీయ నేతగా ఘనత

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు మోదీ.. సోమ, మంగళవారాల్లో ఆ దేశంలో పర్యటించారు. మాస్కోలో ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి పుతిన్‌ తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు. రెండో రోజు ఇరునేతలు విస్త్రృత చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌ యుద్ధంపై అభిప్రాయాలను పంచుకున్నారు. వాణిజ్యం, భద్రత, వ్యవసాయం, సాంకేతికత తదితర రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు అంగీకరించారు. తన పర్యటనలో భాగంగా రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్నీ ప్రధాని మోదీ అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని