Published : 02 Jul 2022 02:14 IST

PM Modi: పుతిన్‌కు మోదీ ఫోన్‌.. ఏం చర్చించారంటే?

దిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌(Vladimir Putin) తో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఫోన్‌లో సంభాషించారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ వ్యవహారాలపైనా ఇద్దరు నేతలూ తమ ఆలోచనలు పంచుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో పుతిన్‌ భారత్‌లో పర్యటించిన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించినట్టు పీఎంవో కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేకించి వ్యవసాయ వస్తువులు, ఎరువులు, ఔషధ ఉత్పత్తుల్లో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింతగా ప్రోత్సహించే అంశంపై పరస్పరం చర్చించుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ వ్యవహారాలతో పాటు అంతర్జాతీయ అణు, ఆహార మార్కెట్లో పరిస్థితిపైనా మాట్లాడుకున్నారని పేర్కొంది. రష్యా దండయాత్రతో ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న పరిస్థితిపై భారత్‌ దీర్ఘకాలంగా చెబుతోన్న పరస్పర చర్చలు, దౌత్యమార్గాల్లో పరిష్కరించుకోవాలన్న వైఖరినే ప్రధాని పునరుద్ఘాటించారని పీఎంవో తెలిపింది. అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని ఇరువురు నేతలూ అంగీకరించారని పీఎంవో పేర్కొంది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని