Pope Francis: జీ7 వేదికగా.. కృత్రిమ మేధపై పోప్‌ ఫ్రాన్సిస్‌ కీలక వ్యాఖ్యలు

కృత్రిమ మేధ వంటి శక్తిమంతమైన సాంకేతికత.. మానవ సంబంధాలను యాంత్రికంగా మార్చేసే ప్రమాదం ఉందని పోప్‌ ఫ్రాన్సిస్‌ హెచ్చరించారు.

Published : 15 Jun 2024 00:10 IST

రోమ్‌: కృత్రిమ మేధ (Artificial Intelligence)ను అభివృద్ధి చేసే, వినియోగించే క్రమంలో మానవాళి గౌరవమర్యాదలను ప్రధానంగా దృష్టిలోఉంచుకోవాలని జీ7 దేశాలకు పోప్‌ ఫ్రాన్సిస్‌ (Pope Francis) పిలుపునిచ్చారు. ఏఐ వంటి శక్తిమంతమైన సాంకేతికత.. మానవ సంబంధాలను యాంత్రికంగా మార్చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈనేపథ్యంలో ఏఐని సద్వినియోగం చేసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. చాట్‌జీపీటీ వంటి రూపాల్లో కృత్రిమ మేధ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ.. దాని ప్రయోజనాలు, పొంచిఉన్న ముప్పుల గురించి మాట్లాడిన ఆయన.. జీ7 శిఖరాగ్ర సదస్సు (G7 Summit)ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి పోప్‌గా చరిత్రకెక్కారు.

జీ7 సదస్సు వేళ.. మోదీ-జెలెన్‌స్కీ భేటీ

‘‘మానవజాతికి సంబంధించిన నిర్ణయాలు యంత్రాలు కాకుండా.. ఎల్లప్పుడూ మనుషులే తీసుకునేలా ఏఐని కట్టడి చేయడంలో నేతలు చొరవ చూపాలి. ఏఐ నిర్ణయాలపై మనుషుల నియంత్రణ అవసరం. కృత్రిమ మేధకు పగ్గాలు వేసేందుకు ముందుకొస్తున్న దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో చేతులు కలిపేందుకు ఈ సదస్సును ఒక అవకాశంగా తీసుకోవాలి’’ అని పోప్‌ పేర్కొన్నారు. ఈసందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా దేశ, విదేశీ నేతలను పోప్‌ పలకరించారు. అంతకుముందు ఆయన.. వాటికన్‌ సిటీలో 100 మందికిపైగా హస్యనటులకు ఆతిథ్యం ఇచ్చారు. కనీసం ఒకరి పెదవులపై చిరునవ్వును తీసుకొచ్చినా.. ఆ భగవంతుడినీ నవ్వించినట్లేనని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు