china: సాల్మన్‌ ఐలాండ్‌లో చైనా సైనిక స్థావరం

క్వాడ్‌ కూటమిలో కీలక భాగస్వామి అయిన ఆస్ట్రేలియాకు అత్యంత సమీపంలో చైనా సైనిక స్థావరం ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు చైనా-సాల్మన్‌ ఐలాండ్స్‌కు మధ్య

Published : 25 Mar 2022 14:45 IST

ఇంటర్నెట్‌డెస్క్: క్వాడ్‌ కూటమిలో కీలక భాగస్వామి అయిన ఆస్ట్రేలియాకు అత్యంత సమీపంలో చైనా సైనిక స్థావరం ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు చైనా-సాల్మన్‌ ఐలాండ్స్‌కు మధ్య జరిగిన ఓ ఒప్పంద  పత్రం ఒకటి ఆన్‌లైన్‌లో లీక్‌ కావడంతో దీనిపై ఆస్ట్రేలియా స్పందించింది. ఈ పరిణామాలు ఆందోళనకరమని పేర్కొంది.

చైనాతో ఒప్పందానికి సంబంధించిన పత్రం సాల్మన్‌ ఐలాండ్స్‌ మంత్రి వర్గం పరిశీలనకు వెళ్లనుంది. ఈ ఒప్పందం గతంలో ఆస్ట్రేలియాతో చేసుకొన్న భద్రతా ఒప్పందాన్ని పోలి ఉంది. సాల్మన్‌ ద్వీపం 2019 నుంచి తైవాన్‌ పక్షాన్ని వీడి చైనా పంచన చేరింది.  తాజా ఒప్పందం కుదిరితే.. చైనా నౌకలు ఆస్ట్రేలియా తీరానికి అత్యంత సమీపంలో మోహరించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు.. ఈ ఒప్పందం ప్రకారం  సాల్మన్‌ ద్వీపంలో మోహరించేందుకు చైనా పోలీసులు, సైన్యం, ఇతర సిబ్బందిని పంపాలని కూడా కోరవచ్చు. ఇప్పటికే గత నెలలో ఓ చైనా నౌక  ఆస్ట్రేలియాలోని ఉత్తరం వైపు ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌లోకి ప్రవేశించడం వివాదాస్పదంగా మారింది.

ఈ ఒప్పందంపై శుక్రవారం ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి పీటర్‌ డుట్టన్‌ స్పందించారు. ‘‘ఎటువంటి సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడంపైన అయినా  ఆస్ట్రేలియా ఆందోళన చెందుతోంది. ఇదే విషయాన్ని మేము సాల్మన్‌ ఐలాండ్స్‌కు తెలియజేస్తాం’’ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఈ ద్వీపానికి సంబంధించిన భద్రతను ఆస్ట్రేలియా చూసుకొంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని