Planet: కోడిగుడ్డు ఆకారంలో గ్రహం!

ఈ ఖగోళంలో అంతు చిక్కని, ఆశ్చర్యపర్చే ఎన్నో వింతలు, విశేషాలు దాగున్నాయి. వాటిని గుర్తించే పనిలో నిమగ్నమై ఉన్న శాస్త్రవేత్తలకు కొత్త కొత్త గ్రహాలు తారసపడుతున్నాయి. తాజాగా 1,500 కాంతి సంవత్సరాల దూరంలో ఓ గ్రహం ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, ఆ గ్రహం గుండ్రంగా

Published : 16 Jan 2022 03:27 IST


(ఫొటో: ఈఎస్‌ఏ ట్విటర్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఖగోళంలో అంతు చిక్కని, ఆశ్చర్యపర్చే ఎన్నో వింతలు, విశేషాలు దాగున్నాయి. వాటిని గుర్తించే పనిలో నిమగ్నమై ఉన్న శాస్త్రవేత్తలకు కొత్త కొత్త గ్రహాలు తారసపడుతున్నాయి. తాజాగా 1,500 కాంతి సంవత్సరాల దూరంలో ఓ గ్రహం ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, ఆ గ్రహం గుండ్రంగా కాకుండా కోడిగుడ్డు ఆకారంలో ఉందట. విశ్వంలో ఇప్పటి వరకు గుర్తించిన అన్ని గ్రహాలు అటుఇటుగా గుండ్రటి ఆకారంలోనే ఉన్నాయి. కానీ, ఈ గ్రహం మరింత భిన్నంగా ఉండటం శాస్త్రవేత్తలకు ఆసక్తిని కలిగిస్తోంది. ఈ గ్రహానికి డబ్ల్యూఏఎస్‌పీ-103బీ అని నామకరణం చేశారు.

కేంద్ర నక్షత్రానికి సమీపంలో(20వేల మైళ్ల) డబ్ల్యూఏఎస్‌పీ-103బీ గ్రహం ఉండటం వల్ల ఒత్తిడికి గురై కోడిగుడ్డు ఆకారంలోకి మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడి చుట్టూ తిరిగిరావడానికి భూమికి ఏడాది కాలం పడితే.. ఆ నక్షత్రం చుట్టూ తిరగడానికి డబ్ల్యూఏఎస్‌పీ-103బీకి కేవలం 22 గంటల సమయం మాత్రమే పడుతుందట. యూరోపియన్‌, నాసా స్పేస్‌ ఏజెన్సీలకు చెందిన శాటిలైట్లు, భారీ టెలిస్కోపులను ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ విషయాలను కనుగొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని