Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!
గతంలో డ్రగ్స్ తీసుకున్నట్లు ప్రిన్స్‌హ్యారీ (Prince Harry) తన ఆత్మకథలో పేర్కొనడం తాజాగా చర్చనీయాంశమయ్యింది. ఈ విషయాలను వీసా (visa) దరఖాస్తు సమయంలో వెల్లడించారా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ అమెరికాకు చెందిన మేధోమథన సంస్థ వ్యాజ్యం దాఖలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికన్ నటి మేఘన్‌ను (Meghan) వివాహం చేసుకున్న బ్రిటన్ రాజకుటుంబీకుడు ప్రిన్స్ హ్యారీ (Prince Harry).. కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన వీసా (visa) చెల్లుబాటును సవాలు చేస్తూ అమెరికాకు చెందిన ఓ థింక్ టాంక్ వ్యాజ్యం దాఖలు చేసింది. అమెరికాకు రాకముందు డ్రగ్స్ తీసుకున్నట్లు ఇటీవల విడుదలైన ‘స్పేర్’ (Spare) ఆత్మకథలో ప్రిన్స్‌హ్యారీ అంగీకరించారని.. అమెరికా అధికారుల ముందు ఆ విషయాలను ప్రిన్స్ హ్యారీ దాచి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేసింది. అందుకే ప్రిన్స్ హ్యరీ వీసా దరఖాస్తును బహిర్గతం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఆ అనుమానాలే నిజమైతే మాత్రం.. ప్రిన్స్ హ్యారీ ఇమ్మిగ్రేషన్‌ను కోల్పోవడంతోపాటు అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యే ముప్పు ఎదుర్కోనున్నారు.
అనుమానాలివే..!
ప్రిన్స్ హ్యారీకి వీసా దరఖాస్తును బహిర్గతం చేయాలంటూ అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న ది హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థ వ్యాజ్యం దాఖలు చేసింది. గతంలో కొన్ని సందర్భాల్లో మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు ‘స్పేర్’ ఆత్మకథలో హ్యారీ అంగీకరించారని.. ఇందుకు సంబంధించిన వాస్తవాలు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వీసా దరఖాస్తును విడుదల చేయాలని.. తద్వారా మాదక ద్రవ్యాలు వినియోగాన్ని వీసా సమయంలో ప్రిన్స్ హ్యారీ వెల్లడించారా..? అనే విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని ఫౌండేషన్ డైరెక్టర్ మైక్ హోవెల్ పేర్కొన్నారు.
దీంతోపాటు అమెరికాలో అడుగుపెట్టే ముందు హ్యారీపై నిశిత పరిశీలన జరిగిందా..? అనే విషయంలోనూ అనుమానాలు ఉన్నాయన్నారు. ఒకవేళ డ్రగ్స్ విషయం ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలిసినట్లయితే.. రాజకుటుంబం నుంచి రావడం, ఆయన భార్య సెలబ్రిటీ వంటి అంశాలతో ప్రిన్స్‌హ్యారీకి ప్రత్యేక మినహాయింపు ఇచ్చారా..? అని అందులో ప్రశ్నించారు. అదే నిజమైతే మాత్రం.. చట్టవిరుద్ధమేనని అన్నారు.
డిప్లొమాటిక్ వీసాపై..?
హాలీవుడ్ నటి మేఘన్‌ను వివాహం చేసుకున్న ప్రిన్స్ హ్యారీ.. 2020 మార్చి నెలలో అమెరికా చేరుకున్నారు. అనంతరం కొవిడ్ కారణంగా అక్కడ లాక్‌డౌన్ విధించారు. అప్పటి నుంచి కాలిఫోర్నియాలోని మాంటెసిటో నివాసంలో ఇద్దరు పిల్లలతో కలిసి హ్యారీ-మేఘన్ దంపతులు నివసిస్తున్నారు. అయితే, విదేశీ రాయబారులు, ప్రభుత్వ అధికారులకు ఇచ్చే ‘డిప్లొమాటిక్ వీసా’పైనే ప్రస్తుతం ప్రిన్స్ హ్యారీ అమెరికాలో ఉంటున్నట్లు భావిస్తున్నారు.
అమెరికాకు రాకపోకలు కష్టమే..
ఇదిలాఉంటే, సాధారణంగా అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకునే వారిని నేర చరిత్ర, డ్రగ్స్ వినియోగం వంటి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి అవాస్తవాలు వెల్లడిస్తే మాత్రం అక్కడి చట్టాల ప్రకారం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దేశం నుంచి బహిష్కరణతో పాటు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవడం కూడా వీలుకాదు. ఇలా మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన విషయంలో ఎంతో మంది బ్రిటన్ దేశస్థులు అమెరికా నుంచి నిషేధానికి గురయ్యారు. ఒకవేళ తాజాగా వేసిన వ్యాజ్యంలో ప్రిన్స్‌హ్యారీ విఫలమైతే.. అమెరికాకు రాకపోకలు సాగించడం కష్టమే అవుతుంది. బ్రిటన్ రాజకుటుంబాన్ని ఎదురించి బయటకు వచ్చిన హ్యారీ తాజాగా మరో సవాలును ఎదుర్కోనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
MLC Kavitha: బ్రిజ్ భూషణ్‌పై చర్యలేవీ?: కేంద్రాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ కవిత
-
India News
Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆధారాలు లభించలేదు..!
-
Politics News
BJP: ‘మోదీ.. ది బాస్’ అంటే రాహుల్ జీర్ణించుకోవట్లేదు: భాజపా కౌంటర్
-
General News
Bopparaju: నాలుగో దశ ఉద్యమం మా చేతుల్లో ఉండదు: బొప్పరాజు
-
Movies News
Ugram OTT Release: ఓటీటీలోకి నరేశ్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
General News
APPSC: త్వరలో గ్రూప్ -1, గ్రూప్-2 నోటిఫికేషన్లు: గౌతమ్ సవాంగ్