Prince Harry: కోర్టు బోనెక్కనున్న రాకుమారుడు.. 130 ఏళ్లలో తొలిసారి!
ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలతో ఓ వార్తా సంస్థపై వేసిన కేసులో కోర్టుకు హాజరుకానున్న ప్రిన్స్ హ్యారీ (Prince Harry).. కోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పనున్నారు.
లండన్: బ్రిటన్ రాజు ఛార్లెస్ III రెండో తనయుడు ప్రిన్స్ హ్యారీ (Prince Harry), ఆయన సతీమణి మెర్కెల్ (Meghan Markle)లు కొంతకాలంగా వరుస వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తమపై చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఓ వార్తా సంస్థపై హ్యారీతోపాటు ఇతర ప్రముఖులు వేసిన కేసు విచారణకు రానుంది. ఈ కేసులో కోర్టుకు హాజరై బోనులో నిలబడి సాక్ష్యం చెప్పనున్నారు. దీంతో 130 ఏళ్లలో కోర్టు రూమ్‌లో సాక్ష్యం చెప్పిన ఓ బ్రిటన్ రాజకుటుంబీకుడిగా (Britain Royal Family) ప్రిన్స్ హ్యారీ నిలవనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది.
బ్రిటన్‌కు చెందిన మిర్రర్ గ్రూప్.. అనేక మంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకుగానూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఫోన్ హ్యాకింగ్ ఆరోపణలకు సంబంధించి ప్రిన్స్ హ్యారీతోపాటు వంద మందికిపైగా ప్రముఖులు కోర్టులో దావా వేశారు. ఈ కేసు విచారణ మేలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా లండన్ హైకోర్టులో హ్యారీ సాక్ష్యం చెప్పనున్నారు.
అంతకుముందు 1870లో ఓ విడాకుల కేసుకు సంబంధించి ఎడ్వర్డ్ VII కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. మరో 20ఏళ్ల తర్వాత ఓ పరువునష్టం కేసు విచారణ సమయంలోనూ సాక్ష్యమిచ్చారు. ఈ రెండు కూడా ఆయన రాజు కాకముందే జరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: తెదేపా ఓ కుటుంబం.. కార్యర్తలు మా బిడ్డలు: భువనేశ్వరి
-
King Of Kotha OTT Release: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త చిత్రం.. ఆ విషయంలో నో క్లారిటీ..!
-
Demat accounts: ఊరిస్తున్న మార్కెట్లు.. పెరిగిన డీమ్యాట్ ఖాతాలు
-
Rathod Bapu Rao: భారాసకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా: రాథోడ్ బాపూరావు
-
Lokesh: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దౌర్జన్యం.. నిలదీస్తే నిర్బంధం..: లోకేశ్
-
Sri Lanka: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయిన శ్రీలంక మాజీ క్రికెటర్‌కు బెయిల్