Priyanka Chopra: యుగాల తర్వాత వినిపిస్తోన్న గళం.. అగ్నిపర్వతంలా పేలుతుంది..!

హిజాబ్‌ సరిగా ధరించలేదన్న అభియోగంపై అరెస్టయిన మాసా అమీని అనే యువతి నైతిక విభాగం పోలీసుల కస్టడీలో మరణించింది. దీనిని వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తోన్న మహిళలకు నటి ప్రియాంక చోప్రా మద్దతు ప్రకటించారు. 

Published : 07 Oct 2022 11:19 IST

టెహ్రాన్‌: హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఇరాన్‌ మహిళలకు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మద్దతు పలికారు. హిజాబ్‌ సరిగా ధరించలేదన్న అభియోగంపై అరెస్టయిన మాసా అమీని అనే యువతి నైతిక విభాగం పోలీసుల కస్టడీలో మరణించింది. ఈ ఘటనపై వ్యక్తం అవుతోన్న నిరసనల్లో యువతులు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో తమ హక్కుల కోసం పోరాడుతున్న మహిళల ధైర్యాన్ని ఆమె కొనియాడారు. 

‘మాసా అమీని మృతిని వ్యతిరేకిస్తూ.. ఇరాన్‌తో సహా ప్రపంచదేశాల్లోని పలువురు మహిళలు తమ గళాన్ని వినిపిస్తున్నారు. బహిరంగంగా జుట్టు కత్తిరించుకుంటున్నారు. కొన్ని దశాబ్దాల పాటు బలవంతపు మౌనం తర్వాత వినిపిస్తోన్న గళాలు.. అగ్నిపర్వతంలా పేలతాయి. వాటిని అణచివేయలేరు. 

మీ నిరసనల ఉద్దేశం, మీ ధైర్యానికి అబ్బురంగా ఉంది. ప్రాణాలను పణంగా పెట్టి పితృస్వామ్య వ్వవస్థను సవాలు చేయడం, మీ హక్కుల కోసం పోరాడం అంత సులభం కాదు. కానీ, మీరు వెనకడుగు వేయడం లేదు. పాలకులు, అధికారులు నిరసనకారుల సమస్యలను అర్థం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాను’ అని వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో వారికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించాలని ఆకాంక్షించారు. 

ఇదిలాఉంటే, కొద్ది వారాల క్రితం మాసా అమీని అనే యువతిని అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడ్డ ఆమె.. చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 16న మరణించారు. దీంతో ఆమె సొంత ప్రావిన్సు కుర్దిస్థాన్‌లో సెప్టెంబర్‌ 17న మొదలైన నిరసనలు.. ఇరాన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్రతరమయ్యాయి.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts