Ukraine crisis: ఉక్రెయిన్‌ శరణార్థుల కోసం ప్రియాంక చోప్రా విరాళాల సేకరణ

ఆకాశంలో యుద్ధవిమానాలు, నేల పై శవాలు, ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రజలు, వారిని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్న అధికారులు.

Published : 09 Apr 2022 12:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆకాశంలో యుద్ధవిమానాలు.. నేలపై శవాలు.. ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రజలు.. వారిని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తోన్న అధికారులు.. ఎటుచూసినా ఆకలికేకలు, శరణార్థుల ఆక్రందనలు.. ఇది ప్రస్తుతం ఉక్రెయిన్‌ పరిస్థితి. రష్యా చేస్తోన్న దాడికి ఈ దేశం అతలాకుతలం అవుతోంది. ఈ యుద్ధం కారణంగా శరణార్థులకు సహాయం చేయాలని గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా ప్రపంచ నాయకులను కోరారు. ఈ మేరకు సాయం చేయాలంటూ.. యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్ అయిన ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విజ్ఞప్తి చేస్తూ వీడియో విడుదల చేశారు. ‘ప్రపంచ నాయకులారా , శరణార్థులను ఆదుకోవాల్సిన సమయం వచ్చింది. వారికి అండగా నిలవాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఆ స్థాయిలో పిల్లలు స్థానభ్రంశం అవుతున్న తీరు బాధాకరంగా ఉంది. మనమంతా కేవలం చూస్తూ ఉండలేము. ప్రతి చోటా శరణార్థులకు అండగా ఉంటారా.. వారికి అవసరమైన సహాయం చేస్తారా’ అంటూ ప్రియాంక కోరారు. తన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ బయోల్లో విరాళాల కోసం యూనిసెఫ్‌ లింక్‌ను కూడా జతచేశారు.

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 20లక్షల మంది పిల్లలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యాను మానవహక్కుల కౌన్సిల్‌ నుంచి ఐక్యరాజ్యసమితి సాధారణ సభ బహిష్కరించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని