Canada: 1985 విమాన పేలుడుపై దర్యాప్తు కొనసాగుతోంది: కెనడా

1985లో ఎయిర్‌ ఇండియా కనిష్క విమానంలో బాంబు దాడి ఘటనలో విచారణ ఇంకా కొనసాగుతోందని కెనడా పోలీసులు పేర్కొన్నారు.     

Published : 22 Jun 2024 17:58 IST

అట్టావా: ఇండియా కెనడా (Canada) మధ్య దౌత్య వివాదాలు కొనసాగుతున్న వేళ కెనడా దిద్దుబాటు చర్యలకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా నో ఫ్లై జాబితా నుంచి తొలగించాలంటూ ఇద్దరు ఖలిస్థానీ వేర్పాటువాదులు చేసిన అభ్యర్థనను ఫెడరల్ కోర్టు ఆఫ్ అప్పీల్‌ తిరస్కరించింది. 39ఏళ్ల క్రితం జరిగిన ఎయిరిండియా ఫ్లైట్ 182 కనిష్క బాంబు దాడి కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుందని ఆ దేశ అధికారులు తెలిపారు.  1985 జూన్ 23న మాంట్రియల్-న్యూదిల్లీ ఎయిర్ ఇండియా కనిష్క  విమానం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో లాండ్ కావడానికి 45నిమిషాల ముందు పేలిపోయింది. (ఇందులో సిక్కు ఉగ్రవాదులు బాంబు అమర్చారు)పేలుడుతో మొత్తం 329 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు. వారిలో ఎక్కువ మంది కెనడాలో నివసిస్తున్న ఇండో-కెనడియన్లు.

రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్(RCMP) అసిస్టెంట్ కమీషనర్ డేవిడ్ టెబౌల్ మాట్లాడుతూ దీనిని అతిపెద్ద ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. ఘటనలో మృతి చెందిన కెనడియన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు సుదీర్ఘంగా కొనసాగుతోందన్నారు. 

కనిష్క విషాద ఘటన జరిగి 39 ఏళ్లు అయిన సందర్భంగా స్మారక సభను నిర్వహిస్తున్నట్లు కెనడాలోని ఇండియా కాన్సులేట్‌ జనరల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. మృతులందరి జ్ఞాపకార్థం ఈ నెల 23న సాయంత్రం ఆరున్నర గంటలకు వాంకోవర్‌లోని స్టాన్లీ పార్క్‌కు చెందిన సెపర్లీ ప్లే గ్రౌండ్‌లోని ఎయిర్‌ ఇండియా మెమోరియల్‌ వద్ద సంతాప సభ ఉంటుందని తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావం తెలపాలని ప్రవాస భారతీయులను కోరింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు