Indian Student: ఇది కదా దేశభక్తి.. భారతీయ విద్యార్థి వీడియో వైరల్‌ !

విదేశాల్లో చదువుకున్న ఓ విద్యార్థి డిగ్రీ పట్టా అందుకునే ముందు త్రివర్ణపతాకాన్ని ప్రదర్శించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Updated : 11 Aug 2023 18:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విదేశాల్లో ఓ భారతీయ విద్యార్థి (Indian Student) చూపించిన దేశభక్తిని అందరూ మెచ్చుకుంటున్నారు. ‘దేశభక్తి అంటే ఇది కదా’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏ దేశంలోనో తెలియదుగానీ, విద్యార్థులకు డిగ్రీ పట్టా ప్రదానోత్సవం జరుగుతోంది. అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం ఒక్కో విద్యార్థిని స్టేజ్‌పైకి ఆహ్వానించి డిగ్రీని చేతికందిస్తున్నారు. అక్కడే చదువుకున్న భారతీయ విద్యార్థి వంతు వచ్చింది. అతడు ఫ్యాంటు, షర్టు కాకుండా.. సంప్రదాయ కుర్తా, పైజామా ధరించి వచ్చాడు. వస్తూ వస్తూనే అక్కడున్న పెద్దల అనుమతి తీసుకొని.. డిగ్రీ పట్టా అందుకోక ముందే.. జేబులోంచి మువ్వన్నెల పతాకం తీసి ప్రదర్శించాడు. దేశంపై అపారమైన గౌరవంతో మూడు రంగుల జెండా పట్టుకొని స్టేజ్‌ చుట్టూ తిరిగాడు. దీనికి సంబంధించిన వీడియోను మిని త్రిపాఠీ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు