Aman Dhaliwal: భారతీయ నటుడిపై అమెరికాలో కత్తితో దాడి !
పంజాబీ నటుడు అమన్ ధలివాల్ (Aman Dhaliwal)పై దాడి జరిగింది. అమెరికాలో ఆయన జిమ్ చేస్తుండగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పలుచోట్ల గాయపరిచాడు.
కాలిఫోర్నియా: ప్రముఖ పంజాబీ నటుడు (Punjabi actor) అమన్ ధలివాల్‌పై (Aman Dhaliwal) అమెరికా (USA)లో గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. కత్తితో శరీరంపై పలుచోట్ల గాయపరిచాడు. కాలిఫోర్నియాలోని ప్లానెట్ ఫిట్‌నెస్ జిమ్‌లో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కసరత్తు చేసేందుకు వెళ్లిన ధలివాల్‌పై నిందితుడు దాడికి దిగడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా బిత్తరపోయారు. అనంతరం తీవ్రగాయాలపాలైన అతడిని జిమ్ సిబ్బంది దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.ఈ దృశ్యాలన్నీ అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. అయితే, నిందితుడు కత్తితో ఎందుకు దాడి చేశాడన్న విషయంపై స్పష్టత లేదు. శరీరమంతా కట్లుతో ఉన్న ధలివాల్ చిత్రంతోపాటు దాడికి పాల్పడిన సమయంలో వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. జిమ్ నిర్వాహకులను ప్రశ్నించారు. ధలివాల్‌కు తీవ్రంగా గాయాలైనట్లు వెల్లడించారు. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నదానిపై ఇటు కుటుంబ సభ్యులుగానీ, అక్కడి వైద్యులుగానీ స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు. అమన్ ధలివాల్ పంజాబ్‌లోని మాన్సాలో జన్మించారు. పంజాబీ, హిందీ, తెలుగు చిత్రాల్లోనూ నటించారు. హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన జోదా అక్బర్ సినిమాలో రాజ్‌కుమార్ రతన్ సింగ్ పాత్ర పోషించారు. ఖలేజా, విస్రా, ఇక్ కుడి పంజాబ్ డి, జాట్ బాయ్స్ పూత్ జట్టన్ డి, అనంత్ ది ఎండ్ తదితర చిత్రాల్లో నటించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: అషు కారు ప్రయాణం.. నిఖిత ‘రెడ్’ హొయలు
-
India News
Viral video: మహిళను కారులోకి లాక్కెళ్లి.. కొట్టడంపై DCW సీరియస్!
-
Sports News
Steve Smith: సూపర్ మ్యాన్‌లా స్మిత్.. క్యాచ్ ఆఫ్ ది సెంచరీ చూస్తారా?
-
Politics News
Komatireddy: రెండ్రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే నిరాహార దీక్ష చేస్తా: ఎంపీ కోమటిరెడ్డి
-
Sports News
IND vs AUS: విరాట్ ఔట్.. గావస్కర్ తీవ్ర అసంతృప్తి!
-
World News
Modi: చైనా నెటిజన్లలోనూ ‘మోదీ’ పాపులర్.. నిక్‌నేమ్ కూడా పెట్టారట..!