ukraine Crisis: పుతిన్‌ ప్రపంచాన్ని భయపెట్టాలనుకుంటున్నారు..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మాస్కో పరేడ్‌లో ప్రపంచాన్ని భయపెట్టాలనుకుంటున్నారని బ్రిటన్‌ రక్షణశాఖ మంత్రి బెన్‌ వాలెస్‌ పేర్కొన్నారు. ప్రపంచ యుద్ధంలో

Published : 09 May 2022 17:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మాస్కో పరేడ్‌లో చేసిన ప్రసంగంతో ప్రపంచాన్ని భయపెట్టాలనుకుంటున్నారని బ్రిటన్‌ రక్షణశాఖ మంత్రి బెన్‌ వాలెస్‌ పేర్కొన్నారు. ప్రపంచ యుద్ధంలో నాజీలపై విజయానికి గుర్తుగా ఈ పరేడ్‌ నిర్వహిస్తారు. ఫాసిజంలోని దౌర్జన్యం పుతిన్‌, ఆయన ఆంతరంగికుల్లో ప్రతిబింబిస్తోందని వాలెస్‌ అన్నారు. నేడు ఆయన లండన్‌లోని నాజీ మ్యూజియంలో ప్రసంగించారు. రష్యా ప్రజలను, ప్రపంచాన్ని ప్రస్తుతం జరుగుతోన్న సైనిక చర్యను చూపి భయపెట్టాలని పుతిన్‌ భావిస్తున్నారని ఆరోపించారు. ‘‘నిష్కారణంగా జరుగుతోన్న ప్రస్తుత యద్ధంతో ఉపయోగం లేదు. కానీ, రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగాలను కచ్చితంగా ఇది అవమానించడమే’’ అని పేర్కొన్నారు.

విక్టరీ డే జరుపుకొంటున్న సమయంలో కూడా ఉక్రెయిన్‌పై దాడులను రష్యా ఆపలేదు. క్రిమియా ద్వీపకల్పం నుంచి ఉక్రెయిన్‌పై క్షిపణి దాడి నిర్వహించింది. దక్షిణ ఒడెస్సా ప్రాంతంపైకి దీనిని ప్రయోగించినట్లు సమాచారం. ఈ దాడిని ఉక్రెయిన్‌ కూడా ధ్రువీకరించింది. రష్యా ఆనెక్స్‌ క్షిపణిని ప్రయోగించినట్లు వెల్లడించింది.

రష్యా విక్టరీ డే పరేడ్‌లో పుతిన్‌ మాట్లాడుతూ.. పశ్చిమ దేశాల విధానాలకు ప్రతిచర్యగానే ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్య చేపట్టామని సమర్థించుకొన్నారు. నియో నాజీలతో పొంచి ఉన్న ముప్పు నుంచి ‘మాతృభూమి’ని రక్షించుకోవడం కోసమే ఉక్రెయిన్‌లో రష్యా సేనలు పోరాడుతున్నాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని