astronaut : ముగిసిన సుదీర్ఘ అంతరిక్ష యాత్ర.. క్షేమంగా భూమికి తిరిగొచ్చిన వ్యోమగాములు!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) నుంచి సోయుజ్‌ ఎంఎస్‌-23 (Soyuz MS-23) స్పేస్‌ క్రాఫ్ట్‌లో బయలుదేరిన ముగ్గురు వ్యోమగాములు (astronaut) కజక్‌స్థాన్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యారు.   

Published : 27 Sep 2023 18:44 IST

Image: Space_Station

ఇంటర్నెట్‌ డెస్క్‌ : నాసా (Nasa) వ్యోమగామి ఫ్రాంక్‌ రూబియో, రష్యా వ్యోమగాములు సెర్గే ప్రొకోపీవ్‌, దిమిత్రి పెటెలిన్‌లు తమ అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకొని భూమిని చేరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) నుంచి సోయుజ్‌ ఎంఎస్‌-23 (Soyuz MS-23) స్పేస్‌ క్రాఫ్ట్‌లో బయలుదేరిన వీరు కజక్‌స్థాన్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యారు. ఈ ప్రయాణం 157.4 మిలియన్‌ మైళ్లు. వాస్తవానికి ఈ మిషన్‌ ఆరు నెలల్లోనే పూర్తి కావాల్సి ఉంది. అయితే, 2022 డిసెంబరులో రష్యన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లో ఊహించని లీక్‌ చోటు చేసుకోవడంతో గడువు పొడిగించారు. దాంతో వ్యోమగాములు అంతరిక్షంలో 371 రోజులు గడపాల్సి వచ్చింది. 

రాకెట్ లాంఛర్‌ శకలంతో ఆడుతుంటే పేలిపోయి.. చిన్నారులు మృతి

అంతకముందు నాసా వ్యోమగామి మార్క్ వాన్ డే హే 355 రోజులు గడిపి రికార్డు సృష్టించారు. రూబియో సెప్టెంబరు 2022 సెప్టెంబరు 21న అంతరిక్షంలోకి వెళ్లారు. 2023 సెప్టెంబరు 11న ఆయన మార్క్‌ అంతరిక్షయాన రికార్డును బద్ధలుగొట్టారు. ఇక అంతరిక్ష కేంద్రంలో గడిపిన సమయంలో రూబియో అనేక శాస్త్రీయ పరిశోధనలకు సహకరించారు. భవిష్యత్తులో అనేక మిషన్లను చేపట్టడానికి నాసా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన పరిశోధనల సమాచారం ఎంతో విలువైనదిగా మారింది.

నిర్దేశించిన సమయం కన్నా ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాలనే విషయం తెలిసినా రూబియో, ప్రొకోపీవ్‌, దిమిత్రిలు వెనక్కి తగ్గలేదు. సవాళ్లను ఎదుర్కొంటూనే తమ విధులు నిర్వహించారు. వారి అంకితభావం అంతరిక్షంలో మానవ జీవితంపై అవగాహనను మెరుగుపరచడమే కాకుండా.. భవిష్యత్‌ వ్యోమగాములకు ఓ మార్గదర్శకంగా నిలిచిందని ఖగోళ శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని