USA: బైడెన్‌కు షాక్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లదే హవా..!
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు అనుకూలంగా ఫలితాలు వెలువడవచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఇదే జరిగితే బైడన్ కార్యవర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే.
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికార డెమోక్రాట్లకు షాక్ తగిలే అవకాశం ఉంది. ప్రతినిధుల సభపై రిపబ్లికన్లకు నియంత్రణ లభించే అవకాశం ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలు జరిగిన చాలా చోట్ల రిపబ్లికన్ల జోరు కనిపిస్తోంది. డెమోక్రాట్ల ఆధీనంలో ఉన్న చాలా సీట్లు రిపబ్లికన్లకు దక్కే అవకాశం ఉంది. ఇదే జరిగితే ప్రతినిధుల సభ అధిపత్యం రిపబ్లికన్లకు దక్కి.. బైడెన్ కార్యవర్గ అజెండా అమల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. కాకపోతే ద్రవ్యోల్బణం కారణంగా ఎన్నికలకు ముందు డెమోక్రాట్లు భావించినంత ఘోరమైన ఫలితాలు మాత్రం రావని సర్వేలు చెప్పడం అధికారిక పార్టీకి కాస్త ఊరటనిస్తోంది. ఇక పెన్సిల్వేనియా, జార్జియా, నెవాడ, అరిజోనాల్లో సెనెట్ ఎన్నికల ఫలితాలు మాత్రం ఉత్కంఠను రేకెత్తించే అవకాశాలున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న ఫ్లోరిడా గవర్నర్ రోన్ డిసాంటిస్ ఈ సారి విజయం దక్కించుకుంటారని ఓ ఆంగ్ల వార్తాసంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సారి అమెరికా మధ్యంతర ఎన్నికల్లో దాదాపు 46 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకొన్నారు. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లో మూడోవంతు అంటే 35 స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితోపాటు 36 రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికకు ఓటింగ్ జరిగింది. సాధారణంగా అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికారిక పార్టీ ఎప్పుడూ అధిక సీట్లు సాధించదు. కానీ, అమెరికాలో అబార్షన్లపై సుప్రీం కోర్టు తీర్పు కారణంగా ఈ సారి గండం గట్టెక్కుతామని డెమోక్రాట్లు ఆశించారు. కానీ, అధిక ద్రవ్యోల్బణం వారి ఆశలను దెబ్బతీసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Latestnews News
Pariksha Pe Charcha: మోదీకి తెలంగాణ విద్యార్థిని ప్రశ్న..నివృత్తి చేసిన ప్రధాని
-
Sports News
Sourav Ganguly : కోహ్లీ.. టెస్టుల్లోనూ దూకుడుగా ఆడు : గంగూలీ
-
Movies News
RGV: షారుఖ్ పని అయిపోయిందన్నారు.. ‘పఠాన్’ బదులిచ్చింది
-
General News
Supeme Court: అహోబిలం మఠం కేసు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఎదురుదెబ్బ
-
Politics News
Maharashtra: మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా కెప్టెన్ అమరీందర్ సింగ్..?
-
General News
JEE Main 2023: జేఈఈ మెయిన్ JAN 28- 30 అడ్మిట్ కార్డులొచ్చేశాయ్.. డౌన్లోడ్ చేసుకోండిలా!