China: రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 17మంది మృతి

చైనాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈశాన్య చైనాలో చాంగ్‌చున్‌ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.....

Published : 28 Sep 2022 15:50 IST

బీజింగ్‌: చైనాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈశాన్య చైనాలో చాంగ్‌చున్‌ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 17మంది మృత్యువాత పడగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో చాంగ్‌చున్‌ నగరంలోని న్యూ ఏరియా ఇండస్ట్రియల్‌ జోన్‌లో ఈ దుర్ఘటన జరిగినట్టు జోన్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియలేదని.. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. చైనాలోని జిలిన్‌ ప్రావిన్స్‌ రాజధాని నగరమైన చాంగ్‌చున్‌ ఆటో ఉత్పత్తి కేంద్రంగా ప్రఖ్యాతిగాంచింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని