Published : 13 Apr 2022 23:09 IST

Rishi Sunak: బహిరంగ క్షమాపణలు చెబుతున్నా.. జరిమానా చెల్లించా..!

బ్రిటన్‌ మంత్రి రిషి సనక్‌ ప్రకటన

లండన్‌: కరోనా లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘించడంపై బ్రిటన్‌ ఆర్థికశాఖ మంత్రి రిషి సనక్‌ బహిరంగ క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా పోలీసులు విధించిన జరిమానా కూడా చెల్లించినట్లు పేర్కొన్నారు. ‘పార్టీగేట్‌’గా పిలుస్తోన్న వ్యవహారంపై బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ అక్కడి పార్లమెంటులో ఇటీవలే క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.

‘డౌనింగ్ స్ట్రీట్‌లో జూన్‌ 19న జరిగిన పార్టీలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి పాల్గొనడంపై మెట్రోపాలిటన్‌ పోలీసులు జరిమానా విధించారు. అధికారంలో ఉన్నవారికీ నిబంధనలు వర్తిస్తాయి. అందుకే అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. జరిమానా కూడా చెల్లించాను. ఈ సందర్భంగా బహిరంగ క్షమాపణలు చెబుతున్నా’ అని బ్రిటన్‌ ఆర్థికశాఖ మంత్రి రిషి సనక్‌ పేర్కొన్నారు.

2020, 2021లో బ్రిటన్‌లో కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ అధికార కన్జర్వేటివ్‌ పార్టీ, ప్రభుత్వం నిర్వహించిన విందులు, ఇతర కార్యక్రమాలను ‘పార్టీగేట్‌ స్కాండల్‌’గా పిలుస్తున్నారు. మొత్తం 12 కార్యక్రమాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాటిలో అనేక పార్టీలకు ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇలా కొవిడ్‌ మహమ్మారి విజృంభణ సమయంలో విధించిన ఆంక్షలను ఉల్లంఘించిన ప్రధానమంత్రి జాన్సన్‌, సనక్‌లు తమ పదవులకు రాజీనామా చేయాలని విపక్ష లేబర్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రధానితోపాటు రిషి సనక్‌లు జరిమానా చెల్లించి క్షమాపణలు చెప్పారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts