UK: అక్రమంగా ప్రవేశిస్తే రువాండాకు తరలిస్తాం..! రిషి సునాక్ హెచ్చరిక
బ్రిటన్‌లోకి అక్రమంగా (Illegal Migration) ప్రవేశించేవారిని సొంత దేశాలకు పంపించడమో.. లేదా రువాండా వంటి దేశాలకు తరలించడమో చేస్తామని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ (Rishi Sunak) వెల్లడించారు. ఇంగ్లీష్ ఛానల్ ద్వారా బోట్లలో అక్రమంగా వచ్చే వారిని అడ్డుకునేందుకు బ్రిటన్ కొత్త బిల్లును ప్రతిపాదించింది.
లండన్: దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారిపై ఇక కఠినంగా వ్యవహరిస్తామని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ (Rishi Sunak) హెచ్చరించారు. అక్రమ మార్గాల ద్వారా చొరబడే వారిని శరణార్థిగా పరిగణించేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. బోట్ల ద్వారా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నవారికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్ కొత్తగా తీసుకువచ్చిన విధానానికి (Illegal Migration Bill) సంబంధించిన వివరాలను రిషి సునాక్ మీడియా ముందు వెల్లడించారు.
‘అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే.. ఇక మీరు శరణార్థిగా ఆశ్రయం పొందలేరు. ఆధునిక బానిసత్వం రక్షణ ప్రయోజనాలను కూడా అందుకోలేరు. నకిలీ మానవ హక్కుల దావాలు కూడా వేయలేరు. మొత్తానికి ఇక్కడ ఉండలేరు’ అని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వెల్లడించారు.
‘అక్రమంగా వచ్చిన వారిని నిర్బంధించి.. కొన్ని వారాల్లోనే వారిని సొంత దేశానికి పంపిస్తాం. లేదా అటువంటి వారిని రువాండా వంటి ఇతర దేశాలకు తరలిస్తాం. ఒకసారి ఇలా వెనక్కి పంపినవారిని అమెరికా, ఆస్ట్రేలియా మాదిరిగా తిరిగి బ్రిటన్‌లోకి అడుగు పెట్టకుండా నిషేధిస్తాం’ అని రిషి సునాక్ స్పష్టం చేశారు. చిన్న పడవల ద్వారా ఇంగ్లీష్ ఛానల్‌ను దాటుకొని వచ్చే అక్రమ చొరబాట్లకు తాజాగా తీసుకువచ్చిన బిల్లు అడ్డుకట్ట వేస్తుందని బ్రిటన్ ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
అక్రమ వలసలను అరికట్టడం తన ప్రాధానాంశాల్లో మొదటిదని చెబుతోన్న రిషి సునాక్.. ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని ప్రకటించారు. చట్టపరంగా దేశంలోకి ప్రవేశించే వారితోపాటు స్థానికులకు ఇలా అక్రమంగా వలసవచ్చే గ్యాంగులవల్ల ప్రమాదం పొంచివుందన్నారు. ప్రస్తుత పరిస్థితి నైతికమైంది కాదని.. అందుకే ఈ బోట్లను అడ్డుకునేందుకే ఈ కొత్త చట్టమని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: కూతురి ప్రేమను కాదన్నందుకు.. ప్రియుడితో కలిసి తల్లి హత్య
-
Ts-top-news News
Telangana: ఉడుకుతున్న రాష్ట్రం.. గరిష్ఠంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం