Rolex: 50 ఏళ్ల తర్వాత దొరికిన ‘రోలెక్స్‌’ వాచ్‌

చిన్నదైనా సరే.. పోయిందనుకున్న వస్తువు దొరికితే అంతకంటే సంతోషం మరోటి ఉండదు. దాదాపు 50 ఏళ్ల క్రితం చేజారిన వస్తువు మళ్లీ కనిపించడంతో లండన్‌కు చెందిన ఓ రైతు కూడా ప్రస్తుతం అదే ఆనందంలో ఉన్నారు.

Updated : 19 Jun 2024 09:27 IST

లండన్‌: చిన్నదైనా సరే.. పోయిందనుకున్న వస్తువు దొరికితే అంతకంటే సంతోషం మరోటి ఉండదు. దాదాపు 50 ఏళ్ల క్రితం చేజారిన వస్తువు మళ్లీ కనిపించడంతో లండన్‌కు చెందిన ఓ రైతు కూడా ప్రస్తుతం అదే ఆనందంలో ఉన్నారు. 95 సంవత్సరాల జేమ్స్‌ స్టీలే చేతికున్న ‘రోలెక్స్‌’ గడియారం 1970ల్లో ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఎక్కడో పడిపోయింది. ఎంత వెతికినా దొరక్కపోవడంతో గడ్డితోపాటు పశువులు తినేసి ఉంటాయని ఆశలు వదిలేసుకున్నారు. మెటల్‌ డిటెక్టర్‌గా పనిచేసే ఓ వ్యక్తి తాజాగా ఆ గడియారాన్ని కనిపెట్టి, రైతుకు అందించడంతో.. కలలో కూడా ఊహించని ఆ పరిణామానికి అవాక్కవడం ఆయన వంతైంది. ‘బెల్టు లేకపోయినా కేవలం డయల్‌ మాత్రమే దొరికింది. అది కూడా ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. ప్రస్తుతం అది పనిచేయడం లేదు. ఇప్పుడు దాన్ని బాగుచేయించాలంటే చాలా ఖర్చు అవుతుంది’ అని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని