2000 Notes: గల్ఫ్‌లోని భారతీయులకు రూ.2000 నోట్ల కష్టాలు
రూ.2 వేల నోట్లను మార్పిడి చేసేందుకు గల్ఫ్‌లోని భారతీయులు తీవ్ర తంటాలు పడుతున్నారు. అక్కడి కరెన్సీ ఎక్సేంజీ కేంద్రాలు రూ.2 వేల నోట్లను తిరస్కరించడంతో ఇబ్బందులకు గురవుతున్నారు.
దుబాయ్: రూ.2వేల (2000 Notes) నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటామని ఆర్బీఐ (RBI) తీసుకున్న నిర్ణయంతో గల్ఫ్ (Gulf Countries) దేశాల్లోని భారతీయులు (Indians) తీవ్ర తంటాలు పడుతున్నారు. వాటిని మార్చుకోవడం అక్కడున్న వారికి పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. రూ.2వేల నోట్లతో కరెన్సీ ఎక్స్ఛేంజీ కార్యాలయానికి వెళ్తే.. అక్కడి అధికారులు తిరస్కరిస్తున్నారు. ఆ నోట్లను తీసుకోవద్దంటూ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, నోట్ల మార్పిడి విధానంపై అక్కడి అధికారులకు సరైన అవగాహన లేకపోవడం కూడా భారతీయులను ఇబ్బందులకు గురిచేస్తోంది.
రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు మే 19న ఆర్‌బీఐ ప్రకటించింది. కస్టమర్లకు ఈ నోట్లను ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ప్రజలు తమవద్దనున్న నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబరు 30 వరకు గడువు విధించింది. ఈలోగా నేరుగా బ్యాంకులకు వెళ్లి మార్చుకోవాలని, లేదంటే ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలని సూచించింది. అయితే, ఇప్పటికే గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు.. అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా అక్కడి కరెన్సీ మార్పిడి కేంద్రాలు కూడా రూ.2 వేల నోట్లను తీసుకోవడం నిలిపివేశాయి. దీంతో తమ వద్దనున్న నోట్లను మార్చుకోలేక అవస్థలు పడుతున్నారు. జేబులో డబ్బులు ఉన్నప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు.
వారం రోజుల క్రితం ఫిరోజ్ షేక్ అనే మహిళ.. భర్తను కలిసేందుకు తన ఇద్దరు పిల్లలతో కలిసి దుబాయ్ వెళ్లారు. అయితే, మునుపటిలాగే రూ.2 వేల నోట్లు మార్పిడి చేసుకోవచ్చనే ఉద్దేశంతో కరెన్సీ ఎక్స్ఛేంజ్ కార్యాలయానికి వెళ్లి ఆమె ఎనిమిది 2వేల నోట్లు ఇచ్చారు. వాళ్లు తిరస్కరిండంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. సెప్టెంబరు 30 వరకు గడువు ఉన్నట్లు ఆమె చెప్పినా అక్కడున్న వారు వినిపించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక.. భర్త వచ్చేంత వరకు అక్కడే వేచి చూడాల్సి వచ్చింది. కేవలం ఆమె ఒక్కరే కాదు.. గల్ఫ్ దేశాల్లోని చాలా మంది భారతీయులు ఇలాంటి అవస్థలే పడుతున్నారు. తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. ‘‘గల్ఫ్ దేశాల్లో రూ.2000వేల నోట్లను మార్చడం లేదు’’ అంటూ పోస్టులు పెడుతున్నారు.
తనకు తెలిసిన చాలా మంది దగ్గర రూ.2000 నోట్లు ఉన్నాయని, వాటిని మార్చుకోలేక నానా అవస్థలు పడుతున్నారని గల్ఫ్‌లో ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త చంద్రశేఖర్ భాటియా తెలిపారు. ‘‘ ప్రస్తుతం సెలవులు ఉన్నాయి. చాలా మంది వివిధ ప్రాంతాలను చూసేందుకు ఇక్కడికి వచ్చారు. వాళ్లకి డబ్బు అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నోట్ల మార్పిడి కుదరకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో డబ్బు ఉన్నా.. నిరుపయోగంగా మారిపోయింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు
-
Asian Games 2023 : అట్టహాసంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!