Japan: ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు.. ఒకదాన్నొకటి తాకి..
ఒకే రన్‌వేపైకి వచ్చిన రెండు ప్రయాణికుల విమానాలు (passenger planes) ఒకదాన్నొకటి తాకాయి. జపాన్ (Japan) రాజధాని టోక్యోలో జరిగిందీ ఘటన.
టోక్యో: జపాన్ (Japan) రాజధాని టోక్యో (Tokyo)లోని ఓ ప్రధాన విమానాశ్రయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై రెండు కమర్షియల్ విమానాలు ప్రమాదవశాత్తూ ఒకదాన్నొకటి తాకాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు వెల్లడించారు.
టోక్యోలోని హనేడా ఎయిర్‌పోర్టు (Haneda airport)లో స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యాంకాక్ బయల్దేరిన థాయ్ ఎయిర్‌వేస్ ఇంటర్నేషనల్ విమానం.. తైపీకి బయల్దేరిన ఇవా ఎయిర్‌వేస్ విమానం రన్‌వేపై ఒకేసారి వచ్చి ఒకదాన్నొకటి తాకాయి. దీంతో పైలట్లు వెంటనే అప్రమత్తమై విమానాలను నిలిపివేశారు.
ఒకే రన్‌వే (Runway)పై రెండు విమానాలు నిలిపిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఓ విమానం వింగ్‌లెట్ (రెక్క) స్వల్పంగా దెబ్బతింది. ఆ వింగ్ భాగాలు రన్‌వేపై పడ్డాయి. కాగా.. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. రెండు విమానాలను ఒకేసారి రన్‌వేపైకి ఎలా అనుమతించారన్నదానిపై స్పష్టత లేదు. దీనిపై ఎయిర్‌లైన్ సంస్థలు గానీ, ఎయిర్‌పోర్టు అధికారులు గానీ స్పందించలేదు. ఈ విమానాశ్రయంలో నాలుగు రన్‌వేలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఘటన జరిగిన రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో కొన్ని విమానాల రాకపోకలు ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా
-
RK Roja: తెదేపాను వీడినప్పటి నుంచి కక్ష కట్టారు: మంత్రి రోజా
-
YS Jagan: రేపు దిల్లీకి సీఎం జగన్.. హఠాత్తుగా సామర్లకోట పర్యటన వాయిదా
-
Lottery: స్నేహితులను వరించిన అదృష్టం.. లాటరీలో రూ.కోటిన్నర గెలుపు