Rupert Murdoch: ‘ఫాక్స్‌’ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి వైదొలిగిన రూపర్ట్‌ మర్దోక్‌

ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించి.. మీడియా మొఘల్‌గా పేరుగాంచిన రూపర్ట్‌ మర్దోక్‌ (Rupert Murdoch) ఇక తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

Updated : 21 Sep 2023 20:22 IST

న్యూయార్క్‌: ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించి.. మీడియా మొఘల్‌గా పేరుగాంచిన రూపర్ట్‌ మర్దోక్‌ (Rupert Murdoch) ఇక తన బాధ్యతలకు ముగింపు పలకనున్నారు. ఏడు దశాబ్దాలపాటు మీడియా రంగంలో కొనసాగిన ఆయన.. ఫాక్స్‌ కార్పొరేషన్‌ అండ్‌ న్యూస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఆ బాధ్యతలను ఆయన కుమారుడు లాక్లాన్‌ మర్దోక్‌ చేపట్టనున్నారు.

‘నా వృత్తి జీవితంలో నిత్యం వార్తలు, ఐడియాలతోనే గడిపాను. అది మారదు. మనకు నైపుణ్యం కలిగిన బృందాలు ఉన్నాయి’ అని ఉద్యోగులకు పంపిన నోట్‌లో రూపర్ట్‌ మర్దోక్‌ పేర్కొన్నారు. ఇక 70 ఏళ్లపాటు చేసిన కృషికి ఫాక్స్‌ న్యూస్‌ బోర్డ్‌ ఆఫ్ డైరెక్టర్లు, ఆయా విభాగాలు, అన్ని భాగస్వామ్యపక్షాల తరఫున నాన్నకు అభినందనలు తెలియజేస్తున్నానని మర్దోక్‌ కుమారుడు లాక్లాన్‌ మర్దోక్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

92 ఏళ్ల బిలియనీర్‌ మర్దోక్‌ అయిదో పెళ్లి ఆగిపోయింది!

సీఎన్‌ఎన్‌కు పోటీగా 1996లో మర్దోక్‌ ప్రారంభించిన చిన్న స్టార్టప్‌ (Fox News).. అమెరికాలోనే నంబర్‌ 1 న్యూస్‌ ఛానల్‌గా అవతరించింది. ఫాక్స్‌ న్యూస్‌, ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్, ది న్యూయార్క్‌ పోస్ట్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మీడియా సంస్థలను స్థాపించారు. ప్రపంచ కుబేరుల్లో నిలిచిన మర్దోక్‌ సంపద 17 బిలియన్‌ డాలర్లు. ఈ మీడియా మొఘల్‌కు ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు కాగా.. ఆరుగురు సంతానం. ఇటీవలే ఐదోపెళ్లికి ప్రయత్నించినప్పటికీ.. నిశ్చితార్థం తర్వాత అది రద్దయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని