Rupert Murdoch: 92ఏళ్ల వయసులో ‘ఐదో’ పెళ్లి..! ఇదే చివరిదన్న బిలియనీర్
బిలియనీర్ రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) మరోసారి వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే నలుగురికి విడాకులు ఇచ్చిన ఆయన.. 92 ఏళ్ల వయసులో ఐదో వివాహం (Marriage) చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇదే చివరి వివాహమని చెప్పడం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: మీడియా మొఘల్‌గా పేరుగాంచిన ఆస్ట్రేలియన్-అమెరికన్ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) మరోసారి వివాహం (Marriage) చేసుకునేందుకు సిద్ధమయ్యారు. తన ప్రియురాలు ఆన్ లెస్లీ స్మిత్‌తో ఎంగేజ్మెంట్ జరిగినట్లు వెల్లడించారు. ఇప్పటికే నలుగురితో విడాకులు (Divorce) తీసుకున్న ఆయన.. ఇది మాత్రం చివరి వివాహమని పేర్కొన్నారు. అయితే, నాలుగో భార్య జెర్రీ హాల్ నుంచి విడాకులు తీసుకున్న ఏడు నెలలకే మరో పెళ్లికి సిద్ధం కావడం గమనార్హం.
నాలుగో భార్య జెర్రీ హాల్‌తో గతేడాది ఆగస్టులోనే మర్దోక్ విడాకులు తీసుకున్నారు. అనంతరం కొన్ని రోజులకు మరోసారి ప్రేమలో పడిన ఆయన.. ప్రియురాలి ముందు పెళ్లి ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం. అమెరికా మీడియా కథనాల ప్రకారం, మార్చి 17న న్యూయార్క్‌లో ఈ ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ సందర్భంగా ప్రియురాలి చేతికి రింగు తొడిగిన మర్దోక్.. ‘నేను ప్రేమలో పడటానికి భయపడ్డాను. కానీ, నాకు తెలుసు ఇదే నా చివరి వివాహం అని. బాగుంటుందని ఆశిస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని మర్దోక్ చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఆన్ లెస్లీ స్మిత్ భర్త కూడా ఓ వ్యాపారవేత్త.. 14ఏళ్ల క్రితం ఆయన చనిపోయారు. మర్దోక్ చేసిన పెళ్లి ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన ఆమె.. ఆయనతో జీవితం పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.
న్యూస్‌కార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బిలియనీర్ అయిన మర్దోక్ 2016లో జెర్రీ హాల్ (65)ను వివాహం చేసుకున్నారు. తన కంటే 25 ఏళ్లు చిన్నదైన హాల్.. అమెరికన్ నటి, మోడల్. అంతకుముందు పాట్రిషియా బుకర్, అన్నా మరియా మన్, వెండీ డెంగ్‌తో మర్దోక్ విడాకులు తీసుకున్నారు. మర్దోక్ తన రెండో భార్య మన్ నుంచి విడిపోయిన సందర్భంలో చెల్లించిన భరణం అత్యంత ఖరీదైన భరణాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్‌కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్‌కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్‌కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.