Ukraine crisis: ‘మా భూభాగం ఆక్రమించి.. సైన్యాన్ని నాశనం చేయడమే రష్యా టార్గెట్’!
తూర్పు ఉక్రెయిన్‌లోని భూభాగాన్ని ఆక్రమించుకొని.. సైనిక బలగాల్ని నాశనం చేసేందుకు రష్యా ప్రణాళికలు రచిస్తోందని ఉక్రెయిన్ రక్షణ శాఖ .....
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని భూభాగాన్ని ఆక్రమించుకొని.. సైనిక బలగాల్ని నాశనం చేసేందుకు రష్యా ప్రణాళికలు రచిస్తోందని ఉక్రెయిన్ రక్షణ శాఖ ఆరోపించింది. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలన్నింటినీ స్వాధీనం చేసుకోవడమే రష్యా కొత్త దాడుల టార్గెట్ అంటూ మండిపడింది. ఆ రెండు భూభాగాలు, క్రిమియా మధ్య భూసంబంధాలను ఏర్పరచడం, ఉక్రెయిన్ సాయుధ బలగాలను నాశనం చేయడమే రష్యా లక్ష్యమని తెలిపింది. మరోవైపు, ఇరు దేశాల మధ్య భీకర దాడుల నేపథ్యంలో రష్యాతో యుద్ధ ఖైదీల మార్పిడిలో భాగంగా 60 మంది సైనికులు, 16 మంది పౌరుల్ని తీసుకొచ్చినట్టు ఉక్రెయిన్ ఉప ప్రధాని ఒహ్లా స్టెఫనిష్నా వెల్లడించారు.
ఉక్రెయిన్‌లో ఆపరేషన్ కొనసాగుతోంది.. కొత్త దశ మొదలైంది: లావ్రోవ్
ఉక్రెయిన్‌లో మాస్కో సైనిక చర్య కొత్త దశలోకి ప్రవేశిస్తోందని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లావ్రోవ్ అన్నారు. మంగళవారం ఓ భారతీయ టెలివిజన్ సంస్థతో ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ఆపరేషన్ కొనసాగుతోంది, ఈ ఆపరేషన్ మరో దశ ఇప్పుడు ప్రారంభమవుతోందని లావ్రోవ్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ తూర్పు భాగంలోని డాన్‌బాస్‌లో రష్యా రెండో దశ యుద్ధం ప్రారంభించిందంటూ ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పిన నేపథ్యంలో లావ్రోవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. డొనెట్స్క్, లుహాన్స్క్ రిపబ్లిక్లను పూర్తిగా విముక్తి చేయడమే రష్యా ఆపరేషన్ లక్ష్యమని ఆయన స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్‌లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్‌లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్‌లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్‌పై దాడుల పరంపర
ఉక్రెయిన్‌లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్‌ఫోర్డ్‌లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్‌తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!