Russia: ట్విటర్, ఫేస్‌బుక్‌పై నిషేధం విధించిన రష్యా..!

ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతోన్న సైనిక పోరులో ఆంక్షల పర్వం కొనసాగుతోంది. ఈ సైనిక చర్యను ఖండిస్తూ.. పలు దిగ్గజ సంస్థలు రష్యాలో వాటి ఉత్పత్తులు, సేవలపై ఆంక్షలు విధించాయి.

Updated : 04 Mar 2022 13:48 IST

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతోన్న సైనిక పోరులో ఆంక్షల పర్వం కొనసాగుతోంది. ఈ సైనిక చర్యను ఖండిస్తూ.. పలు దిగ్గజ సంస్థలు రష్యాలో వాటి ఉత్పత్తులు, సేవలపై ఆంక్షలు విధించాయి. అయితే ఇప్పుడు రివర్స్‌లో రష్యా కూడా ఆ తరహా చర్యలే తీసుకుంది. ట్విటర్, ఫేస్‌బుక్, బీబీసీ, యాప్‌ స్టోర్‌ సేవల్ని బ్లాక్‌ చేసినట్లు తెలుస్తోంది. దీని గురించి ఓ మీడియా సంస్థకు చెందిన పాత్రికేయుడు ట్వీట్ చేశారు. సైనిక పోరు గురించి ఉక్రెయిన్‌, ఇతర ప్రాంతాల నుంచి వస్తోన్న సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకే రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు. 

ఫేస్‌బుక్, ట్విటర్, యాప్‌ స్టోర్‌ అన్నీ అమెరికాకు చెందిన సంస్థలు అందిస్తోన్న సేవలే. బీబీసీ బ్రిటన్‌కు చెందింది. వీటి సేవలపై ఆంక్షలంటే అమెరికా, బ్రిటన్‌తో రష్యా నెట్టింటి పోరుకు దిగిందనే అర్థం. ఇక ప్రత్యేక సైనిక చర్యతో దూకుడుగా ముందుకు వెళ్తోన్న రష్యాను అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా, గూగుల్‌, యూట్యూబ్‌లు.. రష్యన్ స్టేట్  మీడియా తమ ప్లాట్‌ఫాంలలో ఆదాయాన్ని ఆర్జించకుండా నిషేధం విధించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని