Ukraine Crisis: ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ..

ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. పౌరులను తరలించేందుకు

Updated : 05 Mar 2022 14:18 IST

మాస్కో : ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. పౌరులను తరలించేందుకు అవకాశం కల్పించింది. ఉక్రెయిన్‌లోని మరియుపొల్, వోల్నవోఖ్‌ నగరాల్లో పౌరులను సురక్షితంగా తరలించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. హ్యూమన్‌ కారిడార్‌ కోసం ఈ మేరకు తాత్కాలికంగా కాల్పులను విరమిస్తున్నట్లు ప్రకటించింది. మాస్కో కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి తమ దళాలు కాల్పులను నిలిపేస్తాయని వెల్లడించింది.

వోల్నవోఖ్‌, మరియుపోల్‌ను రష్యా సేనలు ఇప్పటికే ముట్టడించాయి. ఇతర దేశాల నుంచి వస్తోన్న ఒత్తిడి కారణంగా రష్యా ఈ కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని