Ukraine Crisis: విరుచుకుపడ్డ రష్యన్‌ సేనలు.. ఉక్రెయిన్‌ యాంటీ డ్రోన్‌ వ్యవస్థ ధ్వంసం

ఉక్రెయిన్‌పై రష్యన్‌ బలగాలు మరోసారి భారీ ఎత్తున దాడులకు పాల్పడ్డాయి. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు, కమాండ్ సెంటర్లు, మందుగుండు డిపోలను లక్ష్యంగా చేసుకుని వైమానిక, ఫిరంగి దాడులతో విరుచుకుపడ్డాయి...

Published : 23 May 2022 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యన్‌ బలగాలు మరోసారి భారీ ఎత్తున దాడులకు పాల్పడ్డాయి. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు, కమాండ్ సెంటర్లు, మందుగుండు డిపోలను లక్ష్యంగా చేసుకుని వైమానిక, ఫిరంగి దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలోనే డాన్‌బాస్‌ ప్రాంతంలోని మూడు కమాండ్ పాయింట్‌లు, బలగాలతోపాటు సైనిక సామగ్రి నిల్వ ఉన్న 13 స్థావరాలు, నాలుగు మందుగుండు డిపోలను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనషెంకోవ్ ఆదివారం తెలిపారు. మరోవైపు దక్షిణ ఉక్రెయిన్‌లోని మైకోలైవ్‌ నగరానికి 100 కి.మీ దూరంలో మోహరించిన మొబైల్ యాంటీ-డ్రోన్ వ్యవస్థను మాస్కో రాకెట్లు దెబ్బతీశాయని చెప్పారు.

మైకోలైవ్‌ ప్రాంతంలోని 583 సైనిక స్థావరాలు, 41 కంట్రోల్ పాయింట్లు, 76 ఫిరంగి మోర్టార్ యూనిట్లు, మూడు గ్రాడ్ బ్యాటరీలు, బుకోవెల్ ఉక్రెయిన్‌ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ స్టేషన్‌ను నాశనం చేసినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టి దాదాపు నాలుగు నెలలు కావస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఉక్రెయిన్‌ను చెందిన 174 యుద్ధ విమానాలు, 125 హెలికాప్టర్లు, 3,198 ట్యాంకులను ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది. మరోవైపు.. 29 వేలకుపైగా రష్యన్‌ సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ ప్రకటించింది. 204 యుద్ధ విమానాలు, 170 హెలికాప్టర్లు, 1285 ట్యాంకులను నాశనం చేసినట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని