ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రష్యా ఔట్..!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి బయటకు వచ్చేందుకు రష్యా (Russia) సిద్ధమైంది.
2024 తర్వాత బయటకు వచ్చేందుకు నిర్ణయం
మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి బయటకు వచ్చేందుకు రష్యా (Russia) సిద్ధమైంది. అయితే, 2024 తర్వాతే ఐఎస్ఎస్ నుంచి బయటకు రానున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని మాస్కో స్పేస్ ఏజెన్సీకి కొత్తగా నియమితులైన చీఫ్.. అధ్యక్షుడు పుతిన్‌కు తెలియజేశారు. ‘భాగస్వామ పక్షాలకు ఇచ్చిన హామీలకు తప్పకుండా పూర్తిచేస్తాం. కానీ, ఐఎస్ఎస్ నుంచి 2024 తర్వాత బయటకు రావాలని నిర్ణయించాం’ అని రష్యా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (Roscosmos) చీఫ్ యురీ బొరిసోవ్ పేర్కొన్నట్లు రష్యా అధ్యక్ష భవనం వెల్లడించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తోన్న రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు కొనసాగిస్తోన్న వేళ క్రెమ్లిన్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
అంతరిక్ష పరిశోధనలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ఎంతో కీలకంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. 1998లో కక్ష్యలోకి వెళ్లిన ఐఎస్ఎస్.. భూ కక్ష్యకు అతి తక్కువ ఎత్తులో ఉండి సేవలను అందిస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ కేంద్రాన్ని ఐదు అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. అమెరికా నాసాతోపాటు (NASA) రష్యా (Roscosmos), జపాన్ (JAXA), యూరప్ (ESA), కెనడా (CSA) అంతరిక్ష పరిశోధనా సంస్థల భాగస్వామ్యంతో ఇది కొనసాగుతోంది. గడిచిన రెండు దశాబ్దాలకుపైగా సేవలందిస్తోన్న ఈ కేంద్రంలో వివిధ దేశాలకు చెందిన అనేక మంది వ్యోమగాములు కొన్ని రోజులపాటు అక్కడే ఉంటూ పరిశోధనలు చేపడుతున్నారు.
ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న రష్యాను ఒంటరిని చేసేందుకు పాశ్చాత్య దేశాలు ఆంక్షలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. వాటికి దీటుగా స్పందిస్తోన్న రష్యా.. ఒకవేళ ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే అందుకు ప్రతీకారంగా ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చేస్తామని గత కొన్ని రోజులుగా హెచ్చరిస్తోంది. అయినప్పటికీ అమెరికా కూడా అదే రీతిలో స్పందిస్తోంది. ఇలా రెండు అగ్రదేశాల (America, Russia) మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం వేళ రష్యా బయటకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో అంతరిక్ష పరిశోధనలను స్వతహాగా చేపట్టేందుకు రష్యా ప్రత్యేక సన్నాహాలు చేసుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా