Zircon: ఉక్రెయిన్ సంక్షోభం వేళ.. శక్తిమంతమైన క్షిపణిని పరీక్షించిన రష్యా!
తూర్పు ఉక్రెయిన్లో దాడులు ముమ్మరం చేసిన వేళ రష్యా తాజాగా కీలక ప్రయోగం చేపట్టింది. తన ‘జిర్కాన్’ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా......
మాస్కో: తూర్పు ఉక్రెయిన్లో దాడులు ముమ్మరం చేసిన వేళ రష్యా తాజాగా కీలక ప్రయోగం చేపట్టింది. తన ‘జిర్కాన్’ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు శనివారం ప్రకటించింది. బారెంట్స్ సముద్రంలోని అడ్మిరల్ గోర్ష్కోవ్ యుద్ధనౌక నుంచి దీన్ని ప్రయోగించగా.. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని తెల్ల సముద్రంలో ఉన్న లక్ష్యాన్ని దిగ్విజయంగా ఛేదించినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. కొత్త ఆయుధాల పరీక్షలో భాగంగా ఈ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపింది. ఈ క్షిపణి.. ధ్వని వేగం కంటే దాదాపు తొమ్మిది రెట్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్ఠంగా 1,000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మార్చిలో ఉక్రెయిన్ యుద్ధభూమిలో రష్యా తన అత్యంత కచ్చితత్వంతో కూడిన ‘కింజాల్’ హైపర్సోనిక్ క్షిపణులను మొదటిసారిగా ప్రయోగించిన విషయం తెలిసిందే. దేశానికి చెందిన అజేయ ఆయుధాల కుటుంబంలో ఈ క్షిపణులూ భాగమని పుతిన్ పేర్కొన్నారు. 2020లో నిర్వహించిన మొదటి అధికారిక జిర్కాన్ పరీక్షనూ పుతిన్ గొప్ప సంఘటనగా అభివర్ణించారు. 2014లో క్రిమియా ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి రష్యా క్షిపణి సాంకేతికతలో దూసుకెళ్తోంది. 2018లో పుతిన్ ప్రభుత్వం ఆవిష్కరించిన కొత్త తరం క్షిపణులను ట్రాక్ చేయడం, అడ్డుకోవడం చాలా కష్టం. వేగం, తక్కువ ఎత్తులో ప్రయాణించగల సౌకర్యం వాటిని మరింత శక్తిమంతంగా మారుస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్