Russia: రష్యాలో కలకలం.. జైలు సిబ్బందినే బందీలుగా పట్టుకుని..!

రష్యాలోని ఓ డిటెన్షన్‌ సెంటర్‌లో పలువురు ఖైదీలు కలిసి ఇద్దరు సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం కలకలం రేపింది.

Published : 16 Jun 2024 17:48 IST

మాస్కో: రష్యా (Russia)లోని ఓ నిర్బంధ కేంద్రం (Detention Centre)లో కొంతమంది విచారణ ఖైదీలు కలిసి ఇద్దరు సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. నిందితుల్లో పలువురిని అంతమొందించినట్లు సమాచారం. అధికారుల వివరాల ప్రకారం.. రోస్తోవ్-ఆన్-డాన్ నగరంలోని ప్రీ-ట్రయల్ డిటెన్షన్ సెంటర్‌లో ఆరుగురు ఖైదీలు కలిసి ఇద్దరు జైలు గార్డులను బందీలుగా పట్టుకున్నారు. ఆ ఖైదీలకు ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారు మారణాయుధాలూ కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్‌

ఈ మేరకు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు.. సిబ్బందిని విడిపించేందుకు వెంటనే నిర్బంధ కేంద్రానికి చేరుకున్నాయి. ఆ ఖైదీలను మట్టుబెట్టాయి. ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, వారికి ఎలాంటి గాయాలు కాలేదని ఓ వార్తాసంస్థ తెలిపింది. అయితే, ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారో వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో రష్యాలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు అనేక దాడులకు పాల్పడ్డారు. ఈ ఏడాది మార్చిలో మాస్కోలోని ఓ సంగీత కచేరీ హాల్‌పై జరిపిన కాల్పుల్లో 145 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని