Ukraine Crisis: ఉక్రెయిన్‌ జోరు..! మరో కీలక నగరాన్ని వీడిన పుతిన్‌ సేనలు

ఉక్రెయిన్‌లో రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కీవ్‌ సేనలు చుట్టుముట్టిన కీలక లైమన్ నగరం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్నట్లు రష్యా రక్షణ శాఖ శనివారం ప్రకటించింది...

Published : 02 Oct 2022 01:26 IST

కీవ్‌: ఉక్రెయిన్‌(Ukraine)లో రష్యా(Russia)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కీవ్‌ సేనలు చుట్టుముట్టిన కీలక ‘లైమన్(Lyman)‌’ నగరం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్నట్లు రష్యా రక్షణ శాఖ శనివారం ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin)‌.. లుహాన్స్క్‌, దొనెట్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియాల విలీన ప్రక్రియ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

ఉక్రెయిన్‌ ఎదురుదాడులతో మాస్కో బలగాలు ఇటీవలే ఖర్కివ్‌ నుంచి వెనుదిరిగిన విషయం తెలిసిందే. దొనెట్స్క్‌(Donetsk) రీజియన్‌లోని లైమన్‌.. ఖర్కివ్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. రష్యన్‌ బలగాలు ఈ నగరాన్ని.. లాజిస్టిక్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌ హబ్‌గా వినియోగించాయి. అయితే, ఉక్రెయిన్‌ బలగాలకు భారీ నష్టాన్నే మిగిల్చినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. 200 మంది సిబ్బందిని హతమార్చినట్లు, 14 ఆర్మీ వాహనాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.

కాన్వాయ్‌పై దాడి.. 24 మంది మృతి!

ఇదిలా ఉండగా.. ఖర్కివ్‌ నుంచి వెనుదిరిగినా.. ఆ ప్రాంతంపై రష్యన్‌ దళాల దాడులు కొనసాగిస్తున్నాయి. కుపియాన్‌స్కీలో పౌర వాహనాల కాన్వాయ్‌పై జరిపిన భీకర దాడిలో 24 మంది మృతి చెందినట్లు ఖర్కివ్‌ రీజియన్‌ గవర్నర్‌ ఓలెహ్‌ సినీహుబోవ్ శనివారం వెల్లడించారు. మాస్కో దాడులనుంచి తప్పించుకునేందుకుగానూ ఏడు వాహనాల్లో వారు ఆ ప్రాంతాన్ని వీడుతుండగా.. ఈ దాడి జరిగినట్లు తెలిపారు. మృతుల్లో 13 మంది చిన్నారులు, ఒక గర్భిణి ఉన్నట్లు చెప్పారు. శుక్రవారం సైతం జపోరిజియాలోని ఓ వాహన కాన్వాయ్‌పై జరిగిన దాడిలో.. 30 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని