Russia: జపాన్‌ సమీపంలో యుద్ధవిన్యాసాలు..!

ఒక వైపు ఉక్రెయిన్‌తో యద్ధం జరుగుతుండగానే.. మరో వైపు రష్యా దళాలు జపాన్‌ వద్ద ఉన్న వివాదాస్పద ద్వీపాల్లో యుద్ధవిన్యాసాలు చేపట్టాయి. దాదాపు 3,500 మంది సిబ్బంది,

Updated : 28 Mar 2022 20:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక వైపు ఉక్రెయిన్‌తో యద్ధం జరుగుతుండగానే.. మరో వైపు రష్యా దళాలు జపాన్‌ వద్ద ఉన్న వివాదాస్పద దీవుల్లో యుద్ధవిన్యాసాలు చేపట్టాయి. దాదాపు 3,500 మంది సిబ్బంది, ఎస్‌యూ-35 విమానాలు, ఎంఐ-8 హెలికాప్టర్లు, బాస్టియోన్‌-పి కోస్టల్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌, టీ-72బీ3 ట్యాంకులు, ఓర్లాన్‌-10 మానవరహిత విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. 

జపాన్‌తో త్రైపాక్షిక చర్చల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన కొన్ని రోజుల్లోనే రష్యా ఈ విన్యాసాలను చేపట్టడం గమనార్హం. ఇటీవల ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ జపాన్‌ పలు ఆంక్షలను విధించింది. దీనికి ప్రతి చర్యగా మాస్కో చర్చల నుంచి వైదొలగింది. ఇంటర్‌ ఫాక్స్‌ న్యూస్‌ ఏజెన్సీ కథనం ప్రకారం రష్యా ఈస్ట్రన్‌ మిలటరీ డిస్ట్రిక్ట్‌ విభాగం ఈ యుద్ధ విన్యాసాలను కురిల్‌ ద్వీపాలపై నిర్వహించింది. ఈ ద్వీపాల విషయంలో రష్యా-జపాన్‌ మధ్య విభేదాలు ఉన్నాయి. వీటి పరిష్కారం, ఆర్థిక సహకారంపై కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న శాంతి చర్చల నుంచి రష్యా బయటకు వచ్చేసింది. రష్యా తీరును జపాన్‌ తీవ్రంగా ఖండించింది. రష్యా నిర్వహించిన యుద్ధ విన్యాసాల్లో 3,500 మంది సిబ్బంది, ట్యాంకులు, సెల్ఫ్‌ప్రొపెల్డ్‌ శతఘ్నులు వంటివి ఉన్నాయి. రష్యా ఈస్ట్రన్‌ మిలటరి డిస్ట్రిక్ట్‌లో 80,000 మంది సైనికులు ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని