Ukraine: వెనక్కితగ్గని రష్యా.. అపార్ట్‌మెంట్‌పై క్షిపణి దాడి.. 18 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా నల్ల సముద్రంలోని స్నేక్ ఐలాండ్‌కు సమీపంలో ఉన్న ఒడెసా ఓడరేవులోని అపార్ట్‌మెంట్‌పై క్షిపణితో దాడి చేసింది. ఈ ఘటనలో దాదాపు 18 మంది మృతి చెందారని ఉక్రెయిన్ అధికారులు ధ్రువీకరించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దాడిలో చెలరేగిన మంటలను అదుపు చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన చిత్రాలను కూడా విడుదల చేశారు. కాగా.. స్నేక్ ఐలాండ్‌ను పుతిన్ సేనలు వీడుతున్నట్లు ప్రకటించిన తర్వాత రోజే ఈ దాడి జరగడం గమనార్హం.
ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి చివరి వారంలో రష్యా సైనిక చర్య ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇటీవల తూర్పు ఉక్రెయిన్ నగరమైన క్రెమెన్‌చుక్‌లో ఉన్న రద్దీ షాపింగ్‌మాల్‌పై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడి ఘటనలో సుమారు 10 మరణించగా.. 40 మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు, నల్ల సముద్రంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రదేశం స్నేక్ ఐలాండ్ నుంచి తమ దళాలను ఉపసంహరించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే, ఉక్రెయిన్ మాత్రం రష్యా దళాలను తామే తరిమికొట్టినట్లు పేర్కొంది. దీనికి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ వీడియోను విడుదల చేశారు. దీన్ని తమ వ్యూహాత్మక విజయమని చెప్పారు. ‘‘పూర్తి స్థాయిలో దేశ భద్రతకు ఇంకా హామీ లభించలేదు. శత్రువులు తిరిగి రాలేరని ఇప్పుడే చెప్పలేం. కానీ, ఇది ఆక్రమణదారుల చర్యలను పరిమితం చేయగలదు. వారిని క్రమంగా మా ప్రాదేశిక ప్రాంతాల నుంచి తరిమికొడతాం’’ అని జెలెన్స్కీ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
CM Jagan: ఆ పోరాటం ప్రపంచ మానవాళికి మహోన్నత చరిత్ర.. తిరుగులేని స్ఫూర్తి: సీఎం జగన్
-
Ap-top-news News
Jhanda uncha rahe hamara : ఆ గీతాన్ని రాసినందుకు జైలు శిక్ష..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
-
India News
PM Modi: అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచింది: ప్రధాని మోదీ
-
Ts-top-news News
TSRTC: 75 ఏళ్లు దాటిన వారికి నేడు ఉచిత ప్రయాణం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా