Ukraine Crisis: మేరియుపోల్‌లోని ఉక్రెయిన్‌ సైనికులు లొంగిపోవాలి: రష్యా

మేరియుపోల్‌లో ఉన్న ఉక్రెయిన్‌ సైనికులు ఆయుధాలు పడవేసి లొంగిపోవాలని రష్యా అల్టిమేటం జారీ చేసింది. లొంగిపోయిన సైనికుల ప్రాణాలకు రష్యా హామీ ఇస్తుందని పేర్కొంది. వీరందరిని జెనీవా

Updated : 17 Apr 2022 18:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మేరియుపోల్‌లో ఉన్న ఉక్రెయిన్‌ సైనికులు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని రష్యా అల్టిమేటం జారీ చేసింది. లొంగిపోయిన సైనికుల ప్రాణాలకు రష్యా హామీ ఇస్తుందని పేర్కొంది. వీరందరినీ జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధఖైదీలుగా పరిగణించి సదుపాయాలు కల్పింస్తుందని వెల్లడించింది. ఈ విషయాన్ని రష్యా నిన్న రాత్రి నుంచి ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఉక్రెయిన్‌ వర్గీయులకు వెల్లడిస్తోంది.

మాస్కోకాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు డెడ్‌లైన్‌ విధించింది. ప్రస్తుతం మేరియుపోల్‌లో లక్ష మంది మిగిలి ఉన్నారు. ఈ నగరంలో అత్యధిక ప్రాంతం రష్యా ఆధీనంలోనే ఉంది. ఈ నగరంలో పరిస్థితి దారుణంగా ఉందని నిన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రష్యా అల్టిమేటం విడుదల కావడం గమనార్హం. ఇప్పటికే రష్యా దళాలు ఈ నగరంపై పట్టు సాధించాయి. చాలా చిన్న ప్రాంతాల్లోనే ఉక్రెయిన్‌ మద్దతుదారులు ఉన్నారు. 

ఉక్రెయిన్‌ విమానం కూల్చేశాం..

ఉక్రెయిన్‌ పశ్చిమ దేశాల నుంచి ఆయుధాలను తీసుకెళుతున్న ఓ విమానాన్ని తమ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ పసిగట్టి కూల్చేసిందని రష్యా రక్షణశాఖ ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఇగోర్‌ కన్సెన్‌కోవ్‌ వెల్లడించారు. గత 24 గంటల్లో రష్యా వాయుసేన డజన్ల కొద్దీ ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలు, ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు వివరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని