Putin: ఉత్తర కొరియా పర్యటనకు పుతిన్‌.. 24 ఏళ్లలో ఇదే తొలిసారి!

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) ఉత్తర కొరియాలో పర్యటించనున్నారు.

Published : 17 Jun 2024 18:15 IST

ప్యాంగ్‌యాంగ్‌: దక్షిణ కొరియాతో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చిన వేళ.. ఉత్తర కొరియా మీడియా కీలక ప్రకటన చేసింది. దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆహ్వానం మేరకు జూన్‌ 18- 19వ తేదీల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) ఉత్తర కొరియా (North Korea)లో పర్యటించనున్నట్లు తెలిపింది. అంతర్జాతీయంగా ఇరుదేశాలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఒకవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. ప్యాంగ్‌యాంగ్‌ ఆయుధ పరీక్షలు, ఇతర దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఈ పరిణామాల నడుమ.. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఉత్తర కొరియాలో పుతిన్‌ పర్యటించడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి.

‘2,100 అణ్వాయుధాలు ప్రయోగానికి సిద్ధం’

గత ఏడాది సెప్టెంబరులో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రష్యాలో పర్యటించడం యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మాస్కోలో పుతిన్‌, కిమ్‌లు సమావేశమై.. ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సమయంలోనే కిమ్‌ పర్యటనకు రావడం.. అమెరికా సహా దాని మిత్రదేశాలను ఆందోళనకు గురిచేసింది. యుద్ధం విషయంలో మాస్కోకు రాకెట్లు, క్షిపణులు ఇతర ఆయుధాలను సరఫరా చేసి.. బదులుగా అణ్వాయుధ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన సాంకేతికతను ప్యాంగ్‌యాంగ్‌ పొందుతున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఉత్తర కొరియా మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని