Ukraine Crisis: బెలారస్‌కు రష్యా అణుక్షిపణులు..!
ఇంటర్నెట్‌డెస్క్: ఉక్రెయిన్‌తో యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశాలు ఉండటంతో రష్యా కీలక నిర్ణయం తీసుకొంది. స్వల్పశ్రేణి అణుసామర్థ్య క్షిపణులను బెలారస్‌కు తరలించనుంది. ఈ విషయాన్ని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఇసికందర్-ఎం వ్యవస్థలు బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులను సంప్రదాయ లేదా అణువార్ హెడ్లతో ప్రయోగించవచ్చు. శనివారం బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో సెయింట్ పీటర్స్ బర్గ్‌కు వచ్చారు. అక్కడ ఆయన పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. ‘‘రానున్న కొన్ని నెలల్లో బెలారస్‌కు ఇసికందర్-ఎం టాక్టికల్ మిసైల్ వ్యవస్థలను అందించాలని నిర్ణయం తీసుకొన్నాం’’ అని పేర్కొన్నారు.
ఈ వ్యవస్థల తరలింపుపై ఇరుదేశాల రక్షణ శాఖలు చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే ఇసికందర్ క్షిపణులను బాల్టిక్ ప్రాంతంలోని కలినిన్‌గ్రాడ్‌లో కూడా రష్యా మోహరించింది. నాటో దేశాలైన పోలాండ్-లిథువేనియా మధ్యలో కలినిన్ గ్రాడ్ ప్రాంతం ఉంది. రష్యా నుంచి సామగ్రిని తమ భూభాగం పై నుంచి తరలించడాన్ని లిథువేనియా ఇటీవలే నిషేధించింది. ఈ నేపథ్యంలో బెలారస్‌కు అణు సామర్థ్య క్షిపణులను రష్యా అందజేస్తుండటం గమనార్హం. లిథువేనియా చర్య ఓ రకంగా యుద్ధం ప్రకటించడం వంటిదేనని.. దానిని అస్సలు ఆమోదించకూడదని బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో వాఖ్యానించడం ఆందోళనలు పెంచుతోంది. మరోవైపు బెలారస్ వాడుతున్న సు-25 విమానాలు అణ్వాయుధాలు తీసుకెళ్లేలా మార్పులు చేస్తామని రష్యా అధ్యక్షుడు హామీ ఇచ్చారు.
మరోవైపు లుహాన్స్క్ ప్రాంతంలోని సెవిరోదొనెట్స్క్ నగరాన్ని రష్యా సేనలు పూర్తిగా ఆక్రమించాయి. ఈ విషయాన్ని ఆ నగర మేయర్ వెల్లడించారు. డాన్‌బాస్‌లోని కీలకమైన రెండు పారిశ్రామిక నగరాల్లో ఇది కూడా ఒకటి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Hyderabad: ఆ ట్వీట్‌తో దిల్లీ నుంచి హైదరాబాద్‌కు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
-
World News
Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
-
India News
Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
-
Sports News
T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
-
Viral-videos News
Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Gali Janardhana Reddy: ‘గాలి’ అడిగితే కాదంటామా!
- Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!
- Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!