the Kerch Strait bridge : కెర్చ్‌ వంతెనపై భారీ భద్రత.. యుద్ధ ప్రాతిపదిక మరమ్మతులు

క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ప్రధాన భూభాగంతో కలిపే కెర్చ్‌ వంతెన మరమ్మతులను రష్యా యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ఈ వంతెన రక్షణ బాధ్యతలను ఫెడరల్‌

Published : 10 Oct 2022 01:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ప్రధాన భూభాగంతో కలిపే కెర్చ్‌ వంతెన మరమ్మతులను రష్యా యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ఈ వంతెన రక్షణ బాధ్యతలను ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌కు అప్పజెబుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశాలు జారీ చేశారు. వంతెనపై దెబ్బతిన్న భాగాలను కూల్చివేయాలని, డైవర్లు వెంటనే దర్యాప్తును మొదలుపెట్టాలని రష్యా ఉప ప్రధాని ఆదివారం ఉదయం ఆదేశించారు. 

కెర్చి వంతెనను రష్యన్లు ఈ శతాబ్దంలోనే అత్యున్నత నిర్మాణంగా భావిస్తారు. క్రిమియాకు ఆయుధాలు, మందుగుండు, యుద్ధ పరికరాలు, దళాలను తరలించడానికి దీనిని వినియోగిస్తారు. నిన్న జరిగిన దాడిలో వంతెన 19వ కిలోమీటర్‌ వద్ద చాలా భాగం కుప్పకూలినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నారు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఉక్రెయిన్‌ ప్రధాన లక్ష్యాల్లో ఇది కూడా ఒకటిగా ఉంది. 

పరోక్షంగా కెర్చి వంతెన ప్రస్తావన..

శనివారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ ‘‘నేడు మరీ బాగోకుండా ఏమీ లేదు. మన భూభాగంలో ఎండగానే ఉంది. దురదృష్టవశాత్తు క్రిమియాలో బాగా మబ్బుపట్టింది. అయినా కానీ, వెచ్చగానే ఉంది’’ అంటూ క్రిమియాలో పేలుడును ప్రస్తావించారు. మరోవైపు ఉక్రెయిన్‌ అధికారిక పార్టీ పార్లమెంట్‌ డేవిడ్‌ అక్రహమియా మాట్లడుతూ.. రష్యా అక్రమ నిర్మాణం అగ్నిలో ఆహుతై కొంత కూలిపోయిందన్నారు. ఏదైనా పేలుడు పదార్థాన్ని మీరు వేడిచేస్తుంటే అది అప్పుడైనా.. కొద్దిసేపాగాక అయినా పేలడం ఖాయమన్నారు. మరోవైపు ఈ ఘటనపై క్రిమియా గవర్నర్‌ అక్సోయ్‌నోవ్‌ మాట్లడుతూ ప్రస్తుతం తమ ద్వీపకల్పంలో కొన్ని నెలలకు సరిపడా ఇంధనం, ఆహారం నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితేమీ ఇబ్బందికరం కాదని వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని