Russia: అణుకేంద్రం నిస్సైనికీకరణకు రష్యా ‘నో’

జపొరిజియా అణుకేంద్రం నిస్సైనికీకరణ కోసం ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న విజ్ఞప్తులను రష్‌యా తిరస్కరించింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఈ అణుకేంద్రం కొన్ని నెలలుగా రష్యా ఆధీనంలో ఉంది. ఒక వేళ ఇది పూర్తిగా

Published : 19 Aug 2022 17:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జపొరిజియా అణుకేంద్రం నిస్సైనికీకరణ కోసం ప్రపంచ వ్యాప్తంగా వస్తోన్న విజ్ఞప్తులను రష్యా తిరస్కరించింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఈ అణుకేంద్రం కొన్ని నెలలుగా రష్యా ఆధీనంలో ఉంది. ఒక వేళ ఇది పూర్తిగా నిస్సైనికీకరణ అయితే మరింత ముప్పు ఉంటుందని రష్యా చెబుతోంది.  ఐరోపాలోనే అతిపెద్ద న్యూక్లియర్‌ ప్లాంట్‌ అయిన జపొరిజియాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరు పక్షాలు దీనిని అడ్డుం పెట్టుకొని పరస్పరం షెల్లింగ్‌ చేసుకొంటున్నాయి.

ఉక్రెయిన్‌లోని ల్వివ్‌ నగరంలో అధ్యక్షుడు జలెన్‌స్కీ, ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌, టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్‌ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐరాస చీఫ్‌ జపొరిజియా అణుకేంద్ర భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అణుకేంద్రం ఏ కొంచెం దెబ్బతిన్నా.. ఆత్మహత్యతో సమానమని పేర్కొన్నారు. దీనిని సైనిక అవసరాల కోసం ఏ మాత్రం వినియోగించకూడదని పేర్కొన్నారు. టర్కీ అధినేత ఎర్గొగాన్‌ కూడా ఐరాస చీఫ్‌ అభిప్రాయానికి మద్దతు తెలిపారు. మరోవైపు ఈ అణువిద్యుత్తు కేంద్రాన్ని నిస్సైనికీకరణ చేయాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌స్కీ ఐరాస చీఫ్‌ను కోరారు. గత కొన్నాళ్లుగా ఈ అణుకేంద్రం సైనిక దాడులకు లక్ష్యంగా మారిందని దీనిలో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ విజ్ఞప్తులు వచ్చాయి.

ఈ విజ్ఞప్తులపై రష్యా విదేశాంగశాఖలోని ఇన్ఫర్మేషన్‌ అండ్‌ ప్రెస్‌ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ ఇవాన్‌ నెచయేవ్‌ స్పందిస్తూ.. రష్యా వీటిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘వారు చెప్పినట్లు చేస్తే ప్లాంట్‌ మరింత ప్రమాదకరంగా మారుతుంది’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని