Zelensky: నిధుల కోసం జెలెన్‌స్కీ ఇంటిని విక్రయించనున్న రష్యా..!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) ఇంటిని రష్యా(Russia) విక్రయించనుంది. దానిద్వారా వచ్చిన డబ్బును యుద్ధంలో వాడనుంది. అసలు అది ఎలా సాధ్యమంటే..?
మాస్కో: ఉక్రెయిన్(Ukraine)పై చేపడుతోన్న సైనిక చర్యను కొనసాగించేందుకు రష్యా(Russia) నిధులు సేకరిస్తోంది. అందుకోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) ఇంటిని విక్రయించనుంది. ఆశ్చర్యమనిపించినా అది నిజం. అయితే, ఆ ఇల్లు క్రిమియా ప్రాంతంలో ఉండటంతో రష్యా ఈ సాహసం చేస్తోంది.
2014లో రష్యా దళాలు ఉక్రెయిన్ నుంచి క్రిమియా(Crimea)ను ఆక్రమించుకొన్నాయి. దాని పాలనా వ్యవహారాల కోసం రష్యా ఒక క్రిమియన్ నేతను నియమించింది. ఆయన విడుదల చేసిన వీడియోపై అంతర్జాతీయ మీడియా సంస్థ ఓ కథనాన్ని వెలువరించింది. ఉక్రెయిన్ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు చెందిన 57 ఆస్తులను జాతీయం చేయాలని స్థానిక ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని క్రిమియన్ నేత ఆ వీడియోలో వెల్లడించారు. ‘ఒలెనా జెలెన్‌స్కా పేరు మీద ఉన్న ప్లాట్‌తో కలిపి పలు ఆస్తులపై క్రిమియాకు హక్కులు రానున్నాయి. రష్యా సొంతమైన క్రిమియాలో మాస్కో శత్రువులకు ఆస్తులు ఉండకూడదు’అని అందులో పేర్కొన్నారు.
జెలెన్‌స్కీ 2013లో క్రిమియాలోని తీరప్రాంతమైన లివాడియాలో ఇంటిని కొనుగోలు చేశారు. వెకేషన్‌లో భాగంగా వారు అక్కడ గడిపేవారు. ఆ ఇల్లు జెలెన్‌స్కీ సతీమణి ఒలెనా పేరు మీద ఉంది. దాని విలువ మన కరెన్సీలో రూ. ఆరు కోట్లపైనే. అయితే రష్యా.. క్రిమియాను ఆక్రమించిన తర్వాత వారు ఆ ప్రాంతానికి వెళ్లడం సాధ్యం కాలేదు. ఇప్పుడు దానిని క్రిమియాలోని స్థానిక ప్రభుత్వం వేలం వేయనుంది. ఆ భవనంతో పాటు మొత్తం 57 ఆస్తులను వేలం వేయడం ద్వారా వచ్చిన నిధులను రష్యా ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్య కోసం వెచ్చించనున్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు పరిహారంగా అందించనున్నట్లు క్రిమియా పార్లమెంట్ స్పీకర్ రష్యా మీడియాకు వెల్లడించారు. ఇదిలాఉంటే.. క్రిమియాను అధికారికంగా ఉక్రెయిన్‌లోని భాగంగానే చాలా దేశాలు ఇప్పటికీ గుర్తిస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. ఏ క్షణంలో ఏం జరిగింది?
-
Politics News
Chandrababu: అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ
-
General News
Polavaram: పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించాలని కుట్ర జరుగుతోంది: చలసాని
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
ఆ పాపను తల్లిదండ్రులకు అప్పగించేందుకు.. అన్ని పార్టీలు ఏకమై..!
-
Movies News
Social Look: అనూ అవకాయ్.. సారా స్టెప్పులు.. బీచ్‌లో రకుల్