Ukraine Crisis: రష్యాలోని భారతీయ విద్యార్థులకు కీలక మార్గదర్శకాలు

రష్యాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం పలు మార్గదర్శకాలు జారీ చేసింది.....

Published : 12 Mar 2022 01:23 IST

మాస్కో: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో.. రష్యాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. భారత విద్యార్థులు ప్రస్తుతం రష్యాను వీడేందుకు ఎటువంటి భద్రతా కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాము రష్యాలో ఉంటడం శ్రేయస్కరమేనా? అని విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఎంబసీ సమాధానమిచ్చింది. విద్యార్థులతో సహా భారతీయ పౌరుల భద్రత విషయమై సంబంధిత అధికారులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.

‘ప్రస్తుతం రష్యాను వీడేందుకు ఎలాంటి భద్రతా కారణాలు కనిపించడంలేదు’ అని రాయబార కార్యాలయం పేర్కొంది. అయితే, రష్యాలో బ్యాంకింగ్ సేవలతోపాటు భారత్‌కు నేరుగా విమాన కనెక్టివిటీ విషయంలో అంతరాయం ఏర్పడుతోన్న మాట వాస్తవమేనని తెలిపింది. ఈ విషయాల్లో ఆందోళన ఉన్నవారు తిరిగి భారత్‌కు వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు అని సూచించింది. అకాడమిక్ ప్రోగ్రామ్‌లకు సంబంధించి అనేక విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ఆన్‌లైన్ దూరవిద్య విధానానికి మారినట్లు తమకు సమాచారం ఇచ్చాయని ఎంబసీ పేర్కొంది. విద్యా కార్యకలాపాలకు అంతరాయం కలగకకుండా విద్యార్థులు సంబంధిత విశ్వవిద్యాలయాలతో టచ్‌లో ఉండాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని