Ukraine Crisis: ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తాం.. ఆయుధాలు అందిస్తాం: బైడెన్
ఉక్రెయిన్‌పై రష్యా సేనల భీకర దాడులు కొనసాస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని మరోసారి హామీ ఇచ్చారు......
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా సేనల భీకర దాడులు కొనసాస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని మరోసారి హామీ ఇచ్చారు. ఆయుధాలు సరఫరా చేస్తామని వెల్లడించారు. అలాగే శరణార్థులను తమ దేశంలోకి అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు. కీవ్‌కు ఆర్థిక, ఆహారంతో పాటు ఇతర మానవతా సాయం చేస్తామని ట్విటర్ వేదికగా తెలిపారు. ‘దాడులు చేస్తున్న రష్యా బలగాలను నిలువరించేందుకు ఉక్రెయిన్ వద్ద ఆయుధాలు ఉన్నాయా? లేవా నిర్ధరించుకుంటాం. ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు డబ్బు, ఆహారం, మానవతా సహాయాన్ని పంపుతాం. ఉక్రెయిన్ శరణార్థులను స్వాగతిస్తాం’ అని బైడెన్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మిత్రదేశాలు, భాగస్వాములతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నట్లు బైడెన్ మరో ట్వీట్లో తెలిపారు. యునైటెడ్ స్టేట్స్ గత సంవత్సరంలో ఉక్రెయిన్‌కు $1.2 బిలియన్లకు పైగా భద్రతా సహాయాన్ని అందించిందని వివరించారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం కూడా స్పష్టం చేసింది. ‘ఉక్రెయిన్‌కు అదనపు ఆయుధాలు, పరికరాల కోసం అధ్యక్షుడు బైడెన్ 200 మిలియన్ డాలర్లు సాయం అందించారు. 2021 జనవరి నుంచి ఇప్పటివరకు 1.2 బిలియన్ డాలర్ల రక్షణ సాయాన్ని ఉక్రెయిన్‌కు అమెరికా అందించింది’ అని ట్వీట్ చేసింది.
సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న దండయాత్ర 20వ రోజుకు చేరింది. తొలుత సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులకు దిగిన క్రెమ్లిన్.. ఆ తర్వాత జనావాసాలపైనా విరుచుకుపడుతోంది. బాంబులు, క్షిపణులతో నివాస భవనాలపై దాడులకు తెగబడుతూ మారణకాండ సృష్టిస్తున్నాయి. ఈ డాదుల్ల్లో వేలాదిమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మానవతా కారిడార్లపైనా రష్యా దాడులు చేస్తున్నట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్‌లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్‌లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్‌లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్‌పై దాడుల పరంపర
ఉక్రెయిన్‌లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్‌ఫోర్డ్‌లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్‌తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?