Ukraine Crisis: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడి..!

ప్రస్తుతం రష్యా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత డాన్‌బాస్‌పై అతిపెద్ద దాడిని జరపుతోందని ఉక్రెయిన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవానికి ఐరోపా ఖండంలో కూడా రెండోప్రపంచ యుద్ధం

Published : 25 May 2022 01:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం రష్యా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత డాన్‌బాస్‌పై అతిపెద్ద దాడిని జరపబోతోందని ఉక్రెయిన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవానికి ఐరోపా ఖండంలో కూడా రెండోప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో దాడులు జరగలేదని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రి కులేబా వెల్లడించారు. ఆయుధ సరఫరాను వేగవంతం చేయాలని ఆయన మిత్రదేశాలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మల్టిపుల్‌ రాకెట్‌ లాంఛ్‌ సిస్టమ్స్‌, దీర్ఘశ్రేణి శతఘ్నులను, ఆర్మర్డ్‌ పర్సనల్‌ క్యారియర్లను పంపించాలని కోరారు. రష్యా డాన్‌బాస్‌పై క్రూరమైన యుద్ధం జరుపుతోందన్నారు. 

అంతకుముందు రష్యా రక్షణ మంత్రి మాట్లాడుతూ తమ దళాలు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలోని ఆయుధ నిల్వల కేంద్రాలపై దాడులు జరిపాయని వెల్లడించారు. ఈ డిపోల్లో అమెరికా ఎం777 హోవిట్జర్‌కు చెందిన గుండ్లను భద్రపర్చారని పేర్కొన్నారు. ఈ గుండ్లు అత్యంత కచ్చితత్వంతో శత్రుస్థావరాలను ధ్వంసం చేయగలవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని