Ukraine crisis: ఉక్రెయిన్‌పై ముప్పు తొలగిపోలేదు.. దౌత్య చర్చలకు అంగీకరిస్తున్నాం

ఉక్రెయిన్‌పై పొంచి ఉన్న యుద్ధమేఘాలు పూర్తిగా తొలగి పోలేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ పేర్కొన్నారు. రష్యా దాడి చేయడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయని

Published : 17 Feb 2022 05:58 IST

 అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటన

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై పొంచి ఉన్న యుద్ధమేఘాలు పూర్తిగా తొలగి పోలేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ పేర్కొన్నారు. రష్యా దాడి చేయడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అదే జరిగితే ప్రాణనష్టం భారీగా ఉంటుందని పేర్కొన్నారు. అటువంటి సమయంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకొనేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. రష్యా దాదాపు 1.50 లక్షల దళాలను ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో మోహరించిందని ఆయన తెలిపారు. రష్యా చెబుతున్న బలగాల విరమణ ధ్రువీకరించలేదని ఆయన గుర్తు చేశారు. ‘‘రష్యా బలగాల ఉసంహరణ మంచిదే. కానీ, మేం దానిని పరిశీలించలేదు. రష్యా దళాలు వాటి స్థావరాలకు తిరిగి వెళ్తున్న విషయాన్ని మేము తనిఖీ చేయలేదు. మా విశ్లేషకులు చెబుతున్నదాని ప్రకారం ఇప్పటికీ రష్యా దళాలు చాలా వరకూ ప్రమాదకరమైన పొజిషన్లలోనే ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. అయినా రష్యా కోరినట్లు దౌత్య చర్చలు కొనసాగించేందుకు అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు.

జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌తో  చర్చలు ముగిసిన అనంతరం పుతిన్‌ ప్రసంగించారు. భద్రత విషయమై మాస్కో భయాలను సీరియస్‌గా తీసుకోవాలని పేర్కొన్న కొన్ని గంటల్లోనే బైడెన్‌ ప్రకటన వెలువడింది. నవంబర్‌ నుంచి ఐరోపా ఖండంలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పుతిన్‌ పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఐరోపాలో మరో యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని వివరణ కూడా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు