Russia: చిన్నారి ‘చిత్రం’పై రష్యా కన్నెర్ర.. తండ్రిని బంధించి..బాలికను దూరం చేసి!
ఉక్రెయిన్‌పై చేస్తోన్న యుద్ధంపై (Ukraine Crisis) సొంత దేశంలోనే పుతిన్‌కు (Putin) వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఓ ఐదో తరగతి బాలిక వేసిన చిత్రంపైనా రష్యా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిగా చిన్నారి తండ్రిని హింసిస్తూ.. కేసు నమోదు చేసి నిర్బంధించారు.
మాస్కో: ఉక్రెయిన్‌పై (Ukraine Crisis) సైనిక చర్య విషయంలో ప్రపంచ దేశాలతోపాటు స్థానికంగానూ రష్యాపై (Russia) వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. రష్యా సైనికుల కుటుంబీకులు, మహిళలు కూడా పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే.. ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐదో తరగతి చదువుతోన్న ఓ రష్యన్ చిన్నారి గీసిన ‘చిత్రం’ (Drawing) ఆమె పాలిట శాపంగా మారింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన అక్కడి అధికారులు బాలిక తండ్రిపై క్రిమినల్ కేసు నమోదు చేసి నిర్బంధించడంతోపాటు చిన్నారినీ ఆయనకు దూరంగా ప్రభుత్వ సంరక్షణ గృహానికి తరలించారు.
మాషా మెస్కాలేవ్ అనే బాలిక తన తండ్రి అలెక్సీ మెస్కాలేవ్‌తో కలిసి నివసిస్తోంది. తల్లి దూరంగా ఉంటోంది. ఐదో తరగతి చదువుతోన్న ఆమె.. గతేడాది ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభమైన సమయంలో తరగతి గదిలో ఓ డ్రాయింగ్ వేసింది. తల్లి పక్కనే నిలబడి ఉన్న ఓ చిన్నారి.. రెండు దేశాల(రష్యా, ఉక్రెయిన్) జాతీయ పతాకాలు అందులో ఉన్నాయి. రష్యా వైపు నుంచి దూసుకొస్తున్న క్షిపణులను సూచిస్తూ.. ‘యుద్ధం వద్దు’, ‘ఉక్రెయిన్‌కు మంచిరోజులు’ అంటూ రెండు వాక్యాలు రాసింది. అయితే, ఈ చిత్రం మాత్రం టీచర్‌కు నచ్చలేదు. ప్రిన్సిపాల్‌కు తెలియజేయడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించాడు.
తొలుత జరిమానా..
దీంతో పోలీసులు అలెక్సీని అరెస్టు చేశారు. చిన్నారిని సరిగా పెంచలేదని, రష్యా సైనికులను అప్రతిష్ఠపాలు చేశాడనే నెపంతో అతడిపై కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా 500 డాలర్ల జరిమానా పడింది. అధికారులు అంతటితో ఊరుకోలేదు. మరుసటి రోజు పాఠశాలకు వెళ్లిన చిన్నారిని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తండ్రికి తెలియజేయడంతో.. హుటాహుటిన స్కూల్‌కి వెళ్లాడు. 3.30 గంటలపాటు విచారించిన అధికారులు.. మషాను అలాగే వదిలేస్తే భవిష్యత్తులో నాయకురాలు అవుతుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
చివరకు నిర్బంధించి..
డిసెంబర్‌లో మళ్లీ కోర్టు ఆర్డరుతో అలెక్సీ ఇంటికి వచ్చిన అధికారులు.. చిన్నారిని ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించారు. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. రష్యా సైన్యానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారంటూ అభియోగాలు మోపారు. ఈ కేసు ఏప్రిల్ 6న విచారణకు రానుండగా.. చిన్నారి తండ్రికి మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, తండ్రీబిడ్డను దూరం చేయడంపట్ల స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)
-
Movies News
Siddharth: ఆమెను చూడగానే ఒక్కసారిగా ఏడ్చేసిన హీరో సిద్ధార్థ్
-
Movies News
Anasuya: ఇకపై ఆపేద్దామనుకుంటున్నా.. విజయ్‌తో వార్‌పై తొలిసారి స్పందించిన అనసూయ
-
Sports News
Trent Boult: ట్రెంట్ బౌల్ట్ ఈజ్ బ్యాక్.. వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం!
-
Movies News
Vimanam: ప్రివ్యూలకు రావాలంటే నాకు భయం.. ఇలాంటి చిత్రాలు అరుదు: శివ బాలాజీ