Ukraine Crisis: మరో ఉక్రెయిన్‌ నగరంపై రష్యా పట్టు.. సగం ప్రాంతంపై నియంత్రణ!

తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక నగరమైన ‘సీవీరోడొనెట్స్క్‌’ను రష్యన్‌ బలగాలు సగానికిపైగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయని ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారి మంగళవారం తెలిపారు. ‘దురదృష్టవశాత్తూ.. నగరం రెండుగా విభజన..

Published : 31 May 2022 20:23 IST

కీవ్‌: తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక నగరమైన ‘సీవీరోడొనెట్స్క్‌’ను రష్యన్‌ బలగాలు సగానికిపైగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయని ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారి మంగళవారం తెలిపారు. ‘దురదృష్టవశాత్తూ.. నగరం రెండుగా విభజన అయింది. కానీ, కీవ్‌ సైనికులు ఇప్పటికీ పోరాడుతున్నారు’ అని నగర సైన్య, పౌర పరిపాలన అధికారి ఒలెక్సాండర్ స్ట్ర్యూక్ తెలిపారు. లుహాన్స్క్ రీజియన్‌, ఉక్రెయిన్‌ అధీనంలోని క్రమాటోర్స్క్‌కు మధ్య ఉన్న ముఖ్యమైన ప్రాంతాల్లో సీవీరోడొనెట్స్క్ ఒకటి.

నగరంలో పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉన్నాయని లుహాన్స్క్ ప్రాంతీయ గవర్నర్ సెర్గీ గైదే సైతం వెల్లడించారు. చుట్టుపక్కల గ్రామాలను క్లియర్ చేయడానికి రష్యా ఓ ఆపరేషన్‌ను ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. సైనిక చర్య ప్రారంభ దశలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన మాస్కో సేనలు.. ఇటీవలి కాలంలో డాన్‌బాస్‌ ప్రాంతంలో తమ దాడులను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల వ్యూహాత్మక లైమాన్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాయి.

ఉక్రెయిన్‌ సైనికుల మృతదేహాలు అప్పగిస్తాం!

మేరియుపోల్‌లోని అజోవ్‌స్తల్‌ స్టీల్ ప్లాంట్ కింద సొరంగాల్లో లభ్యమైన 152 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలను ఆ దేశానికి అప్పగించాలని భావిస్తున్నట్లు రష్యా మంగళవారం తెలిపింది. శీతలీకరణ యూనిట్‌లో మృతదేహాలను భద్రపరిచామని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ చివర్లో మాస్కో దళాలు ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో ప్లాంట్‌లోని వందలాది మంది ఉక్రెయిన్‌ సైనికులు రష్యాకు లొంగిపోయారు. మిగతావారు స్టీల్‌ ప్లాంట్‌ కింది భూగర్భ సొరంగాల్లో తలదాచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని