Ukraine Crisis: మీ పోరాటం వీరోచితం.. రష్యన్‌ బలగాలను అభినందించిన పుతిన్‌

ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో పాల్గొంటున్న సాయుధ బలగాల సేవలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం ప్రశంసించారు. ఈ మేరకు ఆదివారం క్రెమ్లిన్ ఓ ప్రకటన విడుదల చేసింది. చేసిన ప్రమాణానికి కట్టుబడి.. రష్యా ప్రజలు, మాతృభూమి కోసం పోరాడుతోన్న ప్రత్యేక కార్యాచరణ దళాల సిబ్బందికి...

Published : 27 Feb 2022 18:49 IST

మాస్కో: ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో పాల్గొంటున్న సాయుధ బలగాల సేవలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం ప్రశంసించారు. ఈ మేరకు ఆదివారం క్రెమ్లిన్ ఓ ప్రకటన విడుదల చేసింది. చేసిన ప్రమాణానికి కట్టుబడి.. రష్యా ప్రజలు, మాతృభూమి కోసం పోరాడుతోన్న ప్రత్యేక కార్యాచరణ దళాల సిబ్బందికి, ఆయా విభాగాల నిపుణులకు పుతిన్‌ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అందులో పేర్కొంది. ఫిబ్రవరి 24 ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి.. రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని సైనిక స్థావరాలు, ఇతర ప్రదేశాలపై దాడులు చేస్తున్నాయి. రాజధాని కీవ్‌ను చేరుకునేందుకు యత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే పుతిన్ వారిని అభినందించారు. వీరోచితంగా పోరాడుతున్నారంటూ కొనియాడారు.

మరోవైపు.. ఆదివారం రష్యా సేనలు ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో సహజవాయువు పైప్‌లైన్‌ను పేల్చివేశాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. మాస్కో క్షిపణుల దాడిలో వాసిల్కివ్‌లో ఓ చమురు టెర్మినల్ దగ్ధమైంది. ఖెర్సన్, బెర్డియాన్స్క్‌ నగరాలను పూర్తిగా బ్లాక్‌ చేశామని రష్యా రక్షణ శాఖ చెప్పినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. హెనిచెస్క్ పట్టణాన్ని, ఖెర్సన్ సమీపంలోని విమానాశ్రయాన్నీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, కీవ్‌లో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, మరోవైపు ఒడెసాలో ఏయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను పునరుద్ధరించినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు