Russia: మా వాళ్లను యుద్ధానికి పంపొద్దు : పుతిన్‌కు రష్యన్ మహిళల విజ్ఞప్తి
ఏడాదికాలంగా ఉక్రెయిన్‌పై యుద్ధం (Ukraine Crisis) చేస్తోన్న రష్యా.. భారీ స్థాయిలో బలగాలను కోల్పోతోందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో సరైన శిక్షణ లేకుండానే తమ కుటుంబీకులను ఉక్రెయిన్ పంపించవద్దని రష్యన్ (Russia) మహిళలు పుతిన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.
మాస్కో: ఉక్రెయిన్‌పై (Ukraine Crisis) సైనిక చర్య పేరిట మొదలైన రష్యా దురాక్రమణ ఏడాదికిపైగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ సైన్యం కూడా మాస్కోను దీటుగా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో వేల మంది రష్యన్ (Russia) సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. తమవారిని యుద్ధక్షేత్రంలోకి పంపించడం ఆపాలంటూ రష్యన్ మహిళలు అధ్యక్షుడు పుతిన్‌కు (Vladimir Putin) విజ్ఞప్తి చేస్తున్నారు. సరైన శిక్షణ, ఆయుధాలు లేకపోవడంతో తమ కుటుంబీకులు శత్రువుల చేతిలో బలవుతున్నారని వాపోతూ ఆందోళనకు దిగారు.
‘రష్యన్లు మాతృభూమికి సేవ చేసేందుకు సిద్ధమై.. సైన్యంలో చేరుతున్నారు. కానీ, సాయుధ బలగాల మాదిరిగా శిక్షణ పొందలేదు. గత సెప్టెంబర్‌లో సైనిక సమీకరణ చేపట్టిన నుంచి కేవలం నాలుగు రోజులే శిక్షణ ఇచ్చారు. వారిని ఇప్పుడు దాడులు చేసే సైనిక బృందాల్లో పాల్గొనాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో శత్రువుల చేతిలో బలికావాల్సి వస్తోంది. గొర్రెలను వధించేందుకు తీసుకెళ్తున్నట్లు శత్రువులు మన వాళ్లను తీసుకుపోతున్నారు. వెంటనే తమవారిని ఉక్రెయిన్‌కు పంపడం ఆపేయండి’ అంటూ రష్యన్ మహిళలు ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో రష్యన్ వార్తా ఛానల్ సోటా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.
ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేసేందుకు... లక్షల మందితో రష్యా సైనిక సమీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, పుతిన్ నిర్ణయం పట్ల సొంత దేశంలోనే తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. భయాందోళనలకు గురైన రష్యన్లు దీన్ని తప్పించుకునేందుకు సమీప దేశాలకు వెళ్లిపోయారు. అయితే, సైన్యంలో చేరిన వారికి సరైన శిక్షణ ఇవ్వకుండానే యుద్ధ క్షేత్రంలోకి రష్యా పంపించిందనే ఆరోపణలు వచ్చాయి. ఉక్రెయిన్‌లో తమకు సరైన తిండి, పోరాడేందుకు ఆయుధాలు లేవంటూ కొందరు రష్యన్ సైనికులు వాపోయిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇటువంటి తరుణంలో తమ కుటుంబీకుల కోసం రష్యన్ తల్లులు, భార్యలు తమ వారిని యుద్ధంలోకి పంపించవద్దని పుతిన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Modi: మోదీ ‘డిగ్రీ’ని చూపించాల్సిన అవసరం లేదు.. కేజ్రీవాల్‌కు జరిమానా
-
India News
Delhi: కొవిడ్ కేసుల పెరుగుదలపై ఆందోళన వద్దు: సీఎం కేజ్రీవాల్
-
World News
North Korea: కిమ్ రాజ్యంలో దారుణాలు.. గర్భిణులు, స్వలింగ సంపర్కులకు ఉరిశిక్షలు
-
General News
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో.. రద్దీ వేళల్లో రాయితీ రద్దు
-
Sports News
CSK: అత్యుత్తమ ఆల్‌రౌండర్.. ఈ స్టార్‌కు మరెవరూ సాటిరారు: హర్భజన్ సింగ్
-
Movies News
Sai Pallavi: అలా కనిపిస్తాను కాబట్టే నన్ను ఎక్కువ మంది ఇష్టపడతారు: సాయి పల్లవి