Ukraine Crisis: ‘ఉక్రెయిన్ మాకు శత్రువు కాదు’.. సొంతదేశంలో పుతిన్‌కు నిరసన సెగ..!

పొరుగుదేశం ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ జరుపుతోన్న పోరును సొంతప్రజలే వ్యతిరేకిస్తున్నారు.

Published : 26 Feb 2022 01:38 IST

మాస్కో: పొరుగుదేశం ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ జరుపుతోన్న పోరును సొంత ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. యుద్ధం చేయొద్దు అంటూ రష్యాలోని నగరాల్లో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.  రాజధాని నగరం మాస్కో నడిబొడ్డున వందల సంఖ్యలో ప్రజలు ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేస్తుండటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఉన్నా వారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీనికి సంబంధించి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. పరిస్థితుల్ని అదుపుచేసే ఉద్దేశంతో పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఒక్క మాస్కో నగరంలోనే దాదాపు వెయ్యిమందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

1979లో అఫ్గానిస్థాన్‌పై రష్యా చేసిన దాడి తర్వాత జరుగుతోన్న ఈ సైనిక చర్యను ప్రతిఒక్కరూ ఖండిస్తున్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని ప్రజల్ని మారణహోమం నుంచి రక్షించేందుకే ఈ సైనిక చర్య అని పుతిన్ చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ లేఖలు, ఆన్‌లైన్ పిటిషన్లపై సంతకాలు చేస్తూ, ఈ సైనిక పోరును ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉక్రెయిన్ తమకు శత్రువు కాదని ఆ దేశానికి మద్దతు ఇస్తున్నారు. కాగా, ఈ అనధికారిక నిరసనలు చట్టవిరుద్ధమంటూ రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ నిన్న హెచ్చరిక జారీ చేసింది. మున్ముందు చట్టపరమైన చర్యలు ఎదురవుతాయిన తెలిసినా వారు ఆగడం లేదు..!








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు